దర్శనం చేయిస్తానని భక్తులకు టోకరా వేసిన దళారి

దర్శనం చేయిస్తానని భక్తులకు టోకరా వేసిన దళారి

తిరుపతి: దేవుడి సన్నిధిలో దళారులు చెలరేగుతున్నారు. ఏ మాత్రం అమాయకంగా కనిపించినా మాయమాటలతో మోసం చేసి దోచుకుంటున్నారు. దళారులను అడ్డుకట్ట వేసేందుకు సాంకేతికంగా.. హైటెక్ పద్ధతుల్లో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. దళారులు కొత్త కొత్త మార్గాల్లో భక్తులకు బురిడీ కొట్టించడం మానడం లేదు. తాజాగా హైదరాబాద్ కు చెందిన భక్తులకు దర్శనం చేయిస్తానని మోసం చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.

హైదరాబాద్ కి చెందిన మధుసూదన్ అనే భక్తుడు వద్ద దర్శనం కోసం 15800 రూపాయలు ఆన్ లైన్ ద్వారా వసూలు చేశాడు దళారి రాంభూపాల్. డబ్బులు పంపించాక సరైన సమాధానం రాకపోవడంతో అనుమానం వచ్చింది. ఫోన్ చేసి గట్టిగా అడిగితే నీళ్లు నమలడమే కాదు ఎదురుతిరిగి దూషించాడు. దీంతో దళారి రాంభూపాల్ పై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు మధుసూధన్. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For More News..

న‌ర్సిరెడ్డి కుటుంబ నిర్ణ‌యం అందరికీ స్ఫూర్తి దాయకం

కూతురితో కలసి రెండంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకింది

అమ్మాయిలా చాటింగ్ చేసి.. 70 మందిని మోసం చేసిన యువకుడు

లైసెన్స్‌‌‌‌‌‌‌‌ లేని వాళ్లకు బండిస్తే రూ. 5 వేలు ఫైన్