నాలుగేండ్ల బాలుడి దారుణ హత్య

V6 Velugu Posted on Nov 21, 2021

  • బాబాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

శంషాబాద్,వెలుగు: నాలుగేండ్ల బాలుడు దారుణ హత్యకు గురైన ఘటన పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలో జరిగింది. మైలార్ దేవ్ పల్లి పరిధిలోని లక్ష్మిగూడ రాజీవ్ గృహకల్పలో ఉండే రాజు, మహేశ్వరి దంపతులకు ఇద్దరు పిల్లలు. మూడేళ్ల క్రితం రాజు అనారోగ్యంతో చనిపోయాడు. మహేశ్వరి జాబ్ చేస్తూ ఇద్దరు పిల్లలను పోషిస్తోంది. శనివారం ఉదయం ఆమె కుమారుడు లక్ష్మినారాయణ అలియాస్ లక్కీ (4) కనిపించకుండాపోయాడు. దీంతో మహేశ్వరి బాలుడి బాబాయి వీరన్నపై అనుమానం వ్యక్తం చేస్తూ మైలార్​దేవ్​పల్లి పీఎస్​లో కంప్లయింట్ చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు ఫైల్ చేశారు. సాయంత్రం పహాడీ షరీఫ్​ పీఎస్ పరిధి జల్ పల్లి మున్సిపాలిటీలోని ఇందిరాగాంధీ సొసైటీలో లక్ష్మినారాయణ డెడ్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న మైలార్ దేవ్ పల్లి, పహాడీషరీఫ్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్వ్కాడ్ సాయంతో ఆధారాలు సేకరించారు. బాలుడిని బండరాయితో కొట్టి చంపినట్లు గుర్తించారు. లక్ష్మినారాయణ బాబాయి వీరన్నను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని విచారిస్తున్నారు. కుటుంబ తగాదాల కారణంగానే హత్య జరిగినట్లు అనుమానిస్తున్నారు.

Tagged murder, Babai, mailardevpalli, family factions

Latest Videos

Subscribe Now

More News