
సిద్దిపేట టౌన్, వెలుగు: సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భంలోనే శిశువు చనిపోయిం ది. బాధితుల వివరాల ప్రకారం.. నారాయణరావ్ పేట మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన కంది పూజ (25) డెలివరీ కోసం శనివారం ఆస్పత్రికి వచ్చింది. పరిశీలించిన డాక్టర్లు డెలివరీ టైం కాలేదని రెండు రోజులు అబ్జర్వేషన్‌లో ఉండాలని అడ్మిట్ చేసుకున్నారు. మంగళవారం ఉదయం డెలివరీ చేద్దామనుకునే సమయానికి గర్భంలోనే శిశువు మరణించింది. విషయం తెలుసుకున్న బంధువులు డాక్టర్ల నిర్లక్షమే కారణమని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం పలువురు నేతలతో కలిసి డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేశారు. ఘటనపై డాక్టర్లను వివరణ కోరగా.. డెలివరీ చేసే సమయానికి హైబీపీ రావడంతో గర్భంలో ఉన్న మగశిశువు చనిపోయాడని చెప్పారు.