
ముంబై: లోన్‌ఫ్రాడ్ కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లతోపాటు, వీడియోకాన్ గ్రూప్ ఫౌండర్ వీ ఎన్ ధూత్‌లపై సీబీఐ మొదటి ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేసింది. మొత్తం 9 ఎంటిటీలపై ఛార్జ్‌షీటు ఫైలయినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చందా కొచ్చర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరుతూ బ్యాంకుకు రిక్వెస్ట్‌ను సీబీఐ పంపించినట్లు కూడా ఆ వర్గాలు పేర్కొన్నాయి.