లిస్టింగ్​కు ఎస్​సీఐ ఆస్తులు

లిస్టింగ్​కు ఎస్​సీఐ ఆస్తులు

న్యూఢిల్లీ:    షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ల్యాండ్ అండ్ అసెట్స్ లిమిటెడ్ (ఎస్​సీఐఎల్​ఏఎల్)ను  ఈ నెలలో స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్​ చేయాలని కేంద్రం భావిస్తోంది.  దీని తర్వాత షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం ఫైనాన్షియల్​ బిడ్‌‌‌‌‌‌‌‌లను ఆహ్వానించే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు. ఎస్​సీఐఎల్​ఏఎల్​కు ఈ ఏడాది -- మార్చి నాటికి రూ. 2,392 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. వీటిలో నాన్​ కోర్​ ఆస్తులను ప్రత్యేక కంపెనీకి ప్రభుత్వం బదలాయించింది.  విభజన ప్రక్రియలో భాగంగా, ఎస్​సీఐఎల్​ఏఎల్​ స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్​ అవుతుంది.  షిప్పింగ్ కార్పొరేషన్  ఆఫ్  ఇండియా (ఎస్​సీఐ)  ప్రతి షేర్​హోల్డర్​ ఎస్​సీఐఎల్​ఏఎల్​లో ఒక వాటాను పొందుతాడు. జూన్ నాటికి ఎస్​సీఐఎల్​ఏఎల్​ స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టింగ్ జరిగే అవకాశం ఉంది.

ఆ తర్వాత ఎస్​సీఐ ప్రైవేటీకరణపై స్పష్టత వస్తుందని, ఆపై ఫైనాన్షియల్ బిడ్‌‌‌‌‌‌‌‌లు ఆహ్వానిస్తారని సంబంధిత అధికారి తెలిపారు. ప్రస్తుతం ఎస్‌‌‌‌‌‌‌‌సీఐలో ప్రభుత్వానికి 63.75 శాతం వాటా ఉంది.  షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా,  ఎస్​సీఐఎల్​ఏఎల్​ మధ్య విభజనకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఫిబ్రవరిలో ఆమోదం తెలిపింది. డిసెంబర్ 2020లో, డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ (దీపమ్​) నిర్వహణ నియంత్రణ బదిలీతో పాటు ఎస్​సీఐలో తన మొత్తం వాటాను అమ్మడానికి ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్స్​ (ఈఓఐ) ను ఆహ్వానించింది.  ముంబై కేంద్రంగా పనిచేసే ఎస్​సీఐ ఫ్లీట్‌‌‌‌‌‌‌‌లో బల్క్ క్యారియర్‌‌‌‌‌‌‌‌లు, ముడి చమురు ట్యాంకర్లు, ఉత్పత్తి ట్యాంకర్లు, కంటైనర్ నాళాలు, ప్యాసింజర్-, - కార్గో నౌకలు, ఎల్పీజీ  ఆఫ్‌‌‌‌‌‌‌‌షోర్ సరఫరా నౌకలు ఉన్నాయి.