కేంద్రం గవర్నర్ వ్యవస్థను పార్టీలాగే వాడుకుంటోంది

కేంద్రం గవర్నర్ వ్యవస్థను పార్టీలాగే వాడుకుంటోంది
  • బడ్జెట్ సమావేశాలకు గవర్నర్కు ప్రాధాన్యతలేదనడం అవగాహన రాహిత్యం
  • మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు గవర్నర్ కు ప్రాధాన్యత లేదని చెప్పడం బీజేపీ నాయకుల అవగాహన రాహిత్యమని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థను పార్టీలాగే వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రతీ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవాలని చూస్తోందన్నారు. బీజేపీకి అభ్యర్థులు లేరు...కాంగ్రెస్ పార్టీలో రోజూ తన్నులాటే...2023లో అధికారంలోకి రావడం ఖాయమని ఎలా చెబుతారు ? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు లేని నావలాగా సాగుతోంది.. ఎప్పుడు ఎటు కొట్టుకుపోతుందో వారికే తెలియదు అని విమర్శించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అక్కడి భారతీయులను తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. 

 

ఇవి కూడా చదవండి

పెండింగ్ చలాన్ల క్లియర్ కు విశేష స్పందన

ఈ యాప్ తో ర్యాగింగ్ ను అడ్డుకోవచ్చు

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్ డేట్స్