బస్తీ దవాఖానాల్లో బడా షేర్‌‌‌‌ కేంద్రానిదే

బస్తీ దవాఖానాల్లో బడా షేర్‌‌‌‌ కేంద్రానిదే
  • ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఎం కింద 60 శాతం నిధుల కేటాయింపు
  • మెడిసిన్‌ , డాక్టర్లు , సిబ్బంది జీతాలు సెంటర్‌ నుంచే
  • గత మూడున్నర నెలల్లోనే 56 స్టార్ట్‌‌‌‌ చేసిన రాష్ట్ర సర్కారు

హైదరాబాద్, వెలుగుగ్రేటర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో రాష్ట్ర సర్కారు ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలకు కేంద్రం నుంచే ఎక్కువ పైసలొస్తున్నాయి. టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ తమ ఘనతగా చెప్పుకొంటున్న ఆ ఆస్పత్రులకు 60% నిధులు కేంద్రమే ఇస్తోంది. మెడిసిన్‌‌‌‌‌‌‌‌, డాక్టర్లు, సిబ్బంది జీతాల వరకు అన్నింటికీ నేషనల్‌‌‌‌‌‌‌‌ హెల్త్‌‌‌‌‌‌‌‌ మిషన్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌ఎం) కింద డబ్బులు కేటాయిస్తోంది.

డాక్టర్లేరీ.. సిబ్బంది ఎక్కడ?

బస్తీ దవాఖానాలకు వందలో రూ.60 కేంద్రం, రూ.40 రాష్ట్రం పెట్టుకుంటున్నాయి. కేంద్రం నిధులిస్తున్నా ఏర్పాటులో ఇన్నాళ్లూ లేట్‌‌‌‌‌‌‌‌ చేసి ఎన్నికల ముందు హడావుడిగా ప్రారంభోత్సవాలు చేశారు. గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని 150 డివిజన్లలో 300 బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు 224 దవాఖాన్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో మూడున్నర నెలల్లోనే 56 దవాఖాన్లను స్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఎన్నికల దృష్ట్యా చిన్న చిన్న రూములకు దవాఖానా బోర్డు తగిలించి ఓపెనింగ్ చేశారు. చాలా చోట్ల కనీస వసతులు లేకపోగా డాక్టర్లు, సిబ్బందినీ నియమించలేదు. ఇతర చోట్ల నుంచి డాక్టర్లను పంపించి మేనేజ్ చేస్తున్నారు.

సిటీకి 4 దిక్కులా మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లేవి?

బస్తీ దవాఖాన్లు తప్ప గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో ఒక్క కొత్త ప్రభుత్వ దవాఖానను కూడా సర్కారు ఏర్పాటు చేయలేదు. నగరానికి నాలుగు దిక్కులా 4 మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు కడతామని సీఎం హామీ ఇచ్చారు. ఆ నాలుగు హాస్పిటళ్లతో ఉస్మానియా, గాంధీలపై పేషెంట్ల ఒత్తిడి తగ్గుతుందని.. జిల్లాల నుంచి వచ్చే ఎమర్జెన్సీ పేషెంట్లకు త్వరగా వైద్యం అందుతుందని చెప్పుకొచ్చారు. కానీ ఒక్క కొత్త దవాఖాననూ ఏర్పాటు చేయలేదు. కేంద్ర నిధులతో ఏర్పాటు చేసిన బీబీనగర్ ఎయిమ్స్‌‌‌‌‌‌‌‌ను, గచ్చిబౌలి స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌లో కరోనా కోసం ఏర్పాటు చేసిన టిమ్స్‌‌‌‌‌‌‌‌ను చూపించి రెండు దవాఖాన్లు తెచ్చామని పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు.

గాంధీకెళ్తే ముక్కు మూసుకోవాల్సిందే

తెలంగాణ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (టిమ్స్) పేరు తప్ప ఇప్పటికీ అక్కడ కరోనాకు తప్ప మరే చికిత్స అందించడం లేదు. కరోనా పేషెంట్లలోనూ సీరియస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉన్నవాళ్లకు ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయకుండా గాంధీకి పంపుతున్నారు. తక్కువ లక్షణాలున్నవారికే టిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందిస్తున్నారు. దీంతో పేద రోగులకు ఉస్మానియా, గాంధీ తప్ప వేరే ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని చెప్పడమే తప్ప ఇప్పటికీ ఉస్మానియా, గాంధీకి వెళ్తే ముక్కు మూసుకోక తప్పని పరిస్థితి. ఉస్మానియాలో బెడ్లు చాలక రోగులను నేలపై పడుకోబెట్టి ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందించాల్సిన దుస్థితి నెలకొంది.