దళితబంధు కొత్తదా.. పాతదా.. రిపోర్టు ఇవ్వండి

దళితబంధు కొత్తదా.. పాతదా.. రిపోర్టు ఇవ్వండి
  • సీఈఓకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం 
  • నివేదిక రెడీ చేస్తున్న కరీంనగర్ కలెక్టర్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ ప్రకటించిన దళిత బంధు పథకంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఈ పథకాన్ని హుజూరాబాద్​లో అమలు చేస్తామనడంపై అనేక కంప్లయింట్స్​వస్తున్నాయని తెలిపింది. ప్రధానంగా ఫోరం​ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లెటర్​ను ప్రస్తావించింది. అసలు ఈ పథకం కొత్తదా? పాతదా? ఇప్పుడే అమలు చేస్తున్నారా? ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకే తెచ్చిన పథకమా? తదితర వివరాలతో పూర్తి రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈఓ) శశాంక్​ గోయల్ ను ఈసీ ఆదేశించింది. ఈసీ ఆర్డర్స్ మేరకు వెంటనే దళిత బంధుపై రిపోర్టు ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ ను సీఈఓ ఆదేశించారు. దళిత బంధుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇటీవల ఈసీకి కంప్లయింట్ చేసింది. ఈ స్కీమ్ ను స్వాగతిస్తున్నామని, అయితే ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు హుజూరాబాద్ లో స్కీమ్ ను అమలు చేయకుండా ఆపాలని కోరింది.