హైదరాబాద్‌లో అక్రమంగా చేతులు మారుతన్న డబ్బును సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈకేసులో ఇద్దర్ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 40 లక్షల నగదు, ఓ కారును స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మేడ్చల్ జిల్లాకు చెందిన కారు డ్రైవర్ డేవిన్ ముత్యాలు, సంగారెడ్డి జిల్లాకు చెందిన కె రాజేష్ లు హఫీజ్ పేట్ కు చెందిన విల్సన్ బాబు దగ్గర గత కొంత కాలంగా పని చేస్తున్నారు.
వీరు విల్సన్ బాబు ఆదేశాల మేరకు అక్రమంగా డబ్బులను తరలిస్తున్నారు. గురువారం నాడు అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామకృష థియేటర్ పార్కింగ్ ప్లేస్ లో నిందితులు TS 08HY1919 ఎండీవోర్ కార్ ను పార్క్ చేసి , గుర్తు తెలియని వ్యక్తి నుండి రూ.40 లక్షలు తీసుకొని విల్సన్ బాబుకు అప్పగించేందుకు ప్లాన్ వేశారు. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారంతో సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా ప్లాన్‌తో దాడి చేసి వారితోపాటు డబ్బును స్వాధీనం చేసుకున్నారు.