అట్టహాసంగా చార్ ధామ్ యాత్ర ప్రారంభం

 అట్టహాసంగా చార్ ధామ్ యాత్ర ప్రారంభం

ఉత్తరాఖండ్ లో చార్ ధామ్ యాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో ఉదయం గంగోత్రి ఆలయ ద్వారాలు, మధ్యాహ్నం యమునోత్రి ద్వారాలను తెరిచారు. అమ్మవార్ల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన పూజారులు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సతీ సమేతంగా గంగోత్రి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. 

కరోనా కారణంగా రెండేళ్ల పాటు చార్ ధామ్ యాత్ర నిలిచిపోయింది. ఈ సారి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారని ఉత్తరాఖండ్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే గంగోత్రికి రోజుకు ఏడువేల మందిని, యమునోత్రికి రోజుకు నాలుగు వేల మంది భక్తులను మాత్రమే అనుమతి ఇస్తామని అధికారులు తెలియజేశారు. కేదార్ నాథ్ ఆలయాన్ని ఈనెల 6వ తేదీన, బద్రినాథ్ ఆలయాన్ని ఈనెల 8వ తేదీన తెరవనున్నారు. కేదార్ నాథ్ ఆలయ దర్శనానికి రోజుకు 12 వేల మందిని, బద్రినాథ్ కు 15 వేల మంది భక్తులను మాత్రమే అనుమతి ఇస్తామని అధికారులు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తల కోసం..

విజయసాయిరెడ్డి ట్వీట్ పై కాంగ్రెస్ మండిపాటు

పవన్ హన్స్ వాటాల అమ్మకంపై అనుమానాలున్నయ్