చెన్నై లవ్‌‌ స్టోరీ క్లాస్‌‌ కాదు.. పక్కా మాస్‌: ‌కిరణ్ అబ్బవరం

చెన్నై లవ్‌‌ స్టోరీ క్లాస్‌‌ కాదు.. పక్కా మాస్‌: ‌కిరణ్ అబ్బవరం

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా రవి నంబూరి దర్శకత్వంలో ఎస్‌కేఎన్, సాయి రాజేశ్ నిర్మించినచిత్రం ‘చెన్నై లవ్‌‌ స్టోరీ’.  మణిశర్మ సంగీతం అందించారు.  ఈ నెల 24న సినిమా విడుదల కానుంది.  హీరో కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా  బుధవారం ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ‘నా కెరీర్‌‌‌‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది. కొన్నేళ్ల తర్వాత నా సినిమాల్లో బెస్ట్‌‌ చూడాలనుకుంటే ఈ సినిమా చూస్తా. ఇందులోని సీన్స్‌‌కు అందరూ బాగా రిలేట్ అవుతారు.

 ప్రమోషనల్ కంటెంట్‌‌ చూసి ఇది క్లాస్‌‌ సినిమా అనుకుంటున్నారు.. కానీ ఇది ప్రాపర్ మాస్ మూవీ. ఇందులోని పాత్రలు, వాటి నేపథ్యం సాలిడ్ మాస్‌‌తో ఉంటాయి.  డైలాగ్స్,  సీన్స్‌‌ మాస్‌‌కే ఎక్కువ కనెక్ట్ అవుతాయి’ అని చెప్పాడు.  స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు అని, మల్టిపుల్‌‌ లేయర్స్‌‌ ఉన్న క్యారెక్టర్‌‌‌‌లో నటించడం సంతోషంగా ఉందని హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ చెప్పింది. 

 నిర్మాత ఎస్‌‌కేఎన్ మాట్లాడుతూ ‘మా అందరి కెరీర్స్‌‌లో హయ్యెస్ట్ థియేటర్స్‌‌లో ఈ సినిమా రాబోతోంది. మా సినిమాను మైత్రీ సంస్థ రిలీజ్ చేస్తోంది. ‘జన నాయకుడు’ సినిమాను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు. ఇద్దరూ మాకు మంచి థియేటర్స్ ఇస్తారని నమ్ముతున్నాం’ అని అన్నారు.  చెన్నై నగరానికి ఈ కథకు సంబంధం ఉంది కనుకే ఈ టైటిల్ పెట్టామని మరో నిర్మాత సాయి రాజేష్ అన్నారు.  నటి సిరి హన్మంతు, డైరెక్టర్ రవి నంబూరి, కో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని పాల్గొన్నారు.