గుండెపోటుతో 12 ఏండ్ల పిల్లోడు మృతి

గుండెపోటుతో 12 ఏండ్ల పిల్లోడు మృతి

మధ్యప్రదేశ్‌‌లో విషాదం

బింద్​: అప్పటి వరకు ఆడిపాడిన పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు.. ఆస్పత్రికి తరలించి చికిత్స అందించే లోపే కన్నుమూశాడు. పరీక్షించిన వైద్యులు.. బాబు మరణానికి కారణం గుండెపోటు అని తేల్చారు. మధ్యప్రదేశ్​లోని బింద్​ లో చోటుచేసుకుందీ విషాద సంఘటన.ఎటావా రోడ్‌‌లో ఉన్న ఓ స్కూల్‌‌లో మనీశ్​ జాతవ్‌‌ నాలుగో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం అన్నతో కలిసి లంచ్‌‌ చేశాడు. తర్వాత 2 గంటలకు ఇంటికెళ్లేందుకు స్కూల్‌‌ బస్సు ఎక్కి, ఆ మరుక్షణమే కుప్పకూలిపోయాడు. స్కూల్‌‌ సిబ్బంది మనీశ్​ను హాస్పిటల్‌‌కు తరలించారు. వెంటనే డాక్టర్లు ట్రీట్‌‌మెంట్‌‌ స్టార్ట్‌‌ చేసి, మనీశ్​ను బతికించేందుకు ప్రయత్నించినా ఫలితంలేకుండా పోయింది. తీసుకొచ్చిన వెంటనే సీపీఆర్‌‌‌‌ చేసినా బాబును బతికించలేకపోయామని వైద్యులు చెప్పారు.