
న్యూఢిల్లీ : మానస సరోవర యాత్రకు వెళ్లే వారి కోసం మూడేండ్ల తర్వాత చైనా–నేపాల్ బార్డర్‌లోని పలు మార్గాలను చైనా ప్రభుత్వం తెరిచింది. అయితే ఈసారి నిబంధనలు కఠిన తరం చేసింది. టూరిస్టు వీసా చార్జీలను పెంచడంతోపాటు వీసా ప్రక్రియను కూడా మరింత టైట్ చేసింది. మారిన నిబంధనలతో ఒక్కొక్కరు కనీసం రూ.1.85 లక్షల దాకా ఖర్చు చేయాల్సి ఉంటుంది.
యాత్రికులను.. ముఖ్యంగా భారత్ నుంచి వచ్చేవారిని నిరుత్సాహపరిచే ఉద్దేశంతోనే వీసా ఫీజు పెంచడంతో పాటు నిబంధనలను కఠినతరం చేసిందనే సందేహాలు వ్యక్తమవున్నాయి.