మిస్టరీ ఇటాలియన్లను చంపే కిల్లర్​

మిస్టరీ ఇటాలియన్లను చంపే కిల్లర్​

ముఖ్యంగా ఇటాలియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. కారణం.. ఒకే ఒక్కడు. అతనే ఆక్స్​మ్యాన్​​. అతను రాత్రుళ్లు ఇటాలియన్ కిరాణా దుకాణాల్లోకి వెళ్లి వ్యాపారులు, సామాన్యుల మీద దాడులు చేశాడు. గొడ్డలితో పుర్రెలు పగలగొట్టడం, గొంతుని రేజర్​తో కోయడం లాంటివి చేసేవాడు. అసలు అతనెవరు? ఎందుకు దాడులు చేశాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే వివరాలు వందేండ్లు దాటినా ఇప్పటికీ తెలియలేదు. 

అది 1918 ఆగస్టు నెల. అమెరికాలోని లూథియానాలో ఉన్న న్యూ ఓర్లీన్స్ నగరం భయంతో వణికిపోతోంది.ముఖ్యంగా ఇటాలియన్లు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. కారణం.. ఒకే ఒక్కడు. అతనే ఆక్స్​మ్యాన్​​. అతను రాత్రుళ్లు ఇటాలియన్ కిరాణా దుకాణాల్లోకి వెళ్లి వ్యాపారులు, సామాన్యుల మీద దాడులు చేశాడు. గొడ్డలితో పుర్రెలు పగలగొట్టడం, గొంతుని రేజర్​తో కోయడం లాంటివి చేసేవాడు. అసలు అతనెవరు? ఎందుకు దాడులు చేశాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? అనే వివరాలు వందేండ్లు దాటినా ఇప్పటికీ తెలియలేదు. 

ఆక్స్​మ్యాన్​ 1917 నుండి మార్చి 1919 వరకు న్యూ ఓర్లీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అనేక ఇండ్లలో దాడులు చేశాడు. ముఖ్యంగా 1918లో ఎక్కువ దాడులు జరిగాయి. తర్వాత మిస్సిసిపి నదిని దాటి పొరుగు పట్టణమైన గ్రెట్నాకు వెళ్లి... అక్కడ కూడా దాడి చేశాడు1919 మార్చి 9న రాత్రి చార్లీ కార్టిమిగ్లియా అనే వ్యక్తి ఇంటిపై దాడి చేశాడు. అదే అతని చివరి దాడి. చార్లీ, అతని భార్య రోసీని విపరీతంగా గాయపరిచాడు. తర్వాత వాళ్ల రెండేండ్ల కూతురిని కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఇటాలియన్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాడు ఆక్స్​మ్యాన్​ . న్యూ ఓర్లీనియన్లు భయాందోళనలకు గురిచేశాడు. ఇటాలియన్ వలసదారుల్లో మగవాళ్లంతా తమ కుటుంబాలను కాపాడుకోవడానికి రాత్రంతా మేల్కొని ఉండేవాళ్లు. న్యూ ఓర్లీన్స్ పోలీస్​ సూపరింటెండెంట్ ఫ్రాంక్ మూనీ కూడా హంతకుడిని పట్టుకునేందుకు కునుకు లేకుండా పనిచేశాడు. 

జాతి వివక్ష కారణమా? 

అంతర్యుద్ధానికి ముందే సిటీలో ఇటాలియన్ వ్యాపార సంఘం బలపడింది. న్యూ ఓర్లీన్స్​కు ముఖ్యంగా​ ఉత్తర ఇటలీ నుండి ఎక్కువగా వలసలు జరిగాయి. అయితే 19వ శతాబ్దం చివరలో సిటీలో శ్రామికుల అవసరం బాగా పెరిగింది. దాంతో తక్కువ జీతాలకు పనిచేసే సిసిలియన్లు(ఇటలీ రీజియన్​లోని సిసిలీ ప్రాంతంలో ఉండేవాళ్లు) సిటీలోకి వచ్చారు. వాళ్లంతా చక్కెర ప్లాంట్లలో పనికి కుదిరారు. కొందరు చెరుకు, పత్తి చేలల్లో పనిచేసేవాళ్లు. వాళ్లలో చాలామంది కష్టపడి పని చేసి, డబ్బు ఆదా చేసుకున్నారు.1880, 1890ల నాటికి సిసిలియన్లు న్యూ ఓర్లీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని మిగతా ఇటాలియన్ వలసలపై ఆధిపత్యం చెలాయించే స్థాయికి ఎదిగారు. సిటీలో ఉన్న ఇటాలియన్ వలసదారుల్లో 80 శాతం పైగా సిసిలియన్లే. 1900 నాటికి నగరానికి దక్షిణాన అతిపెద్ద ఇటాలియన్ కమ్యూనిటీ ఏర్పడింది. అక్కడ దాదాపు 20,000 మంది ఉండేవాళ్లు. వాళ్లలో చాలామంది చిన్న చిన్న వ్యాపారాలు మొదలుపెట్టారు. క్రాస్ రోడ్స్ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పండ్ల దుకాణాలు, కిరాణా షాపులు పెట్టుకున్నారు.1900 నాటికి ఇటాలియన్ యాజమాన్యంలోని వ్యాపారాలు లూథియానా అంతటా విస్తరించాయి. అదే వాళ్ల పాలిట శాపంగా మారిందని కొందరు చెప్తున్నారు. ఎందుకంటే... వాళ్ల ఎదుగుదలను చూడలేకే ఎవరో ఇలా చేసి ఉంటారని కొందరి అభిప్రాయం. 

చనిపోయిన వాళ్లలో దాదాపు అందరూ ఇటాలియన్ వలసదారులే ఉండడంతో వాటిని జాతిపరమైన హత్యలని అనుమానించారు. చాలా మీడియా సంస్థలు ఈ విషయాన్ని హైలైట్​ చేశాయి. ఈ హత్యల్లో మాఫియా ప్రమేయం కూడా ఉందని కొందరు వాదించారు. మరికొందరమో ఆ కిల్లర్​ లైంగిక దాడులు చేశాడని చెప్పారు. శాడిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లా ప్రవర్తించేవాడని మరికొందరు చెప్పుకొచ్చారు. క్రిమినాలజిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు డామన్, కోలిన్ విల్సన్ ప్రకారం.. ఆక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మ్యాన్ తను ఇష్టపడే మహిళలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాడని చెప్పారు. ఆ టైంలో అడ్డు వచ్చిన మగవాళ్లను కూడా చంపేవాడని వాదించారు. ఇలా రకరకాల వాదనలు వినిపించాయి. 

వ్యాపారంలో ఎదుగుదల 

20వ శతాబ్దం మొదట్లో కిరాణా వ్యాపారాన్ని ఇటాలియన్లు చాలావరకు స్వాధీనం చేసుకున్నారు.1880లో న్యూ ఓర్లీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కేవలం 7 శాతం కిరాణా దుకాణాలను మాత్రమే ఇటాలియన్లు నడిపేవాళ్లు. 1900 నాటికి 19 శాతానికి పెరిగింది. ఇక 1920 నాటికి సిటీలోని సగం కిరాణా షాపులు వాళ్లవే. ఆక్స్​మ్యాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాడులను గమనిస్తే... అవన్నీ ఒక్కడే చేశాడు. ప్రత్యేకంగా ఇటాలియన్ కిరాణా వ్యాపారులనే లక్ష్యంగా చేసుకున్నాడు. ప్రాణాలతో బయటపడిన ప్రత్యక్ష సాక్షుల కథనాల ప్రకారం.. ఆక్స్​మ్యాన్​​కు 30 ఏండ్ల వయసు ఉంటుంది. చూడ్డానికి తెల్లగా అమెరికన్​లా ఉన్నాడు. చార్లీపై దాడి తర్వాత ఆక్స్​మ్యాన్​ అదృశ్యమయ్యాడు. 

లోపలికి ఎలా వెళ్లేవాడు?  

ఆక్స్​మ్యాన్​ దాడులు చేస్తున్నాడని అందరికీ తెలుసు. కాబట్టి.. అందరూ తలుపులకి తాళాలు వేసుకుని ఇంట్లోనే ఉండేవాళ్లు. అయినా.. లోపలికి ఎలా వెళ్లగలిగాడు? తలుపులు లేదా గోడలకు చిన్న రంధ్రాలు చేసుకుని వాటి నుంచి వెళ్లేవాడు. ఆ రంధ్రాల సైజ్​ను బట్టి అతను చాలా సన్నగా ఉండేవాడని పోలీసులు అనుకున్నారు. అంతేకాదు.. అతను చాలా బలవంతుడు కూడా. ఎందుకంటే.. క్షణాల్లో గోడలు, తలుపులకు రంధ్రాలు పెట్టేవాడు. చూడ్డానికి ఒక దొంగలా రెడీ అవుతాడు. పిల్లిలా అడుగులో అడుగులు వేస్తూ నడుస్తాడు. ఇంట్లోకి వెళ్లాక ఎవరు ముందు కనిపిస్తే వాళ్లపై దాడి చేస్తాడు. ముఖ్యంగా అందర్నీ గొడ్డలితోనే నరికి చంపాడు. అందుకే అతనికి ‘ఆక్స్​మ్యాన్​’ అని పేరు పెట్టారు. రక్తపు మడుగులో నుంచి నడుస్తూ..  దెయ్యంలా మెల్లిగా అక్కడి నుంచి జారుకుంటాడు. దాడిచేసిన ఇంట్లో లేదా షాపులో ఒక్క వస్తువు కూడా ముట్టుకోడు. అందుకు కారణం... అతని లక్ష్యం దోపిడీ కాదు. కేవలం చంపడమే. 

భయపెట్టిన లెటర్​ 

మార్చి 13, 1919లో న్యూ ఓర్లీన్స్-బేస్​డ్​ న్యూస్​ పేపర్​ ‘టైమ్స్-పికాయున్​’కు ఒక లెటర్​ వచ్చింది. దాన్ని మరుసటి రోజు పేపర్​లో ప్రింట్​ చేశారు. ఆ లెటర్​ రాసింది ఆక్స్​మ్యాన్​. ‘‘నన్ను ఎప్పటికీ పట్టుకోలేరు. కనీసం చూడలేరు. ఎందుకంటే నేను భూమిని చుట్టుముట్టే ఉంటా. కానీ.. కనిపించను. నేను మనిషిని కాదు. అత్యంత వేడిగా ఉండే నరకం నుండి వచ్చిన రాక్షసుడిని. ఓర్లీనియన్లు, తెలివితక్కువ పోలీసులు ‘ఆక్స్​మ్యాన్​’ అని పిలుచుకునే వ్యక్తిని. చంపాల్సినప్పుడల్లా నేను వస్తా. ఎవర్ని చంపుతాననేది నాకు మాత్రమే తెలుసు. నా నెత్తుటి గొడ్డలి తప్ప మరే ఆధారాన్ని నేను వదిలిపెట్టను. నేనెలా ఉంటానో తెలుసుకోవడానికి ప్రయత్నించొద్దు. అలా ప్రయత్నిస్తే.. వాళ్లు నా గొడ్డలి ఆగ్రహానికి గురవుతారు. వాస్తవానికి ఓర్లీనియన్లు నన్ను అత్యంత భయంకరమైన హంతకుడు అనుకుంటారు. కానీ, నేను తలుచుకుంటే ప్రతి రాత్రి మీ నగరానికి వచ్చి వేలాది మందిని చంపగలను. కానీ.. అలా చేయడం లేదు. మృత్యు దేవదూతతో నాకు సన్నిహిత సంబంధం ఉంది. అయితే.. వచ్చే మంగళవారం రాత్రి 12:15 నేను న్యూ ఓర్లీన్స్ మీదుగా వెళ్తా. నా అనంత దయ మీ మీద ఉండాలంటే.. మీరు ఒక పనిచేయాలి. అదేంటంటే.. నాకు జాజ్ మ్యూజిక్​ అంటే చాలా ఇష్టం. ఆ రోజు నాకు ప్రతి ఇంటి నుంచి జాజ్​ మ్యూజిక్ వినిపించాలి. అలాంటి ఇండ్లలోకి నేను రాను. మ్యూజిక్​ వినిపించని ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తిని చంపేస్తా” అనేది ఆ లెటర్​ సారాంశం. లెటర్​ చివర్లో ‘ది ఆక్స్​’ అని రాశారు. 

ప్రతి ఇంట్లో జాజ్​ 

మార్చి 18వ తేదీ మంగళవారం సాయంత్రం 12:15 గంటలకు న్యూ ఓర్లీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ప్రతి ఇంటి నుంచి జాజ్​ మ్యూజిక్​ వినిపించింది. రెస్టారెంట్లు, క్లబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు అన్నీ జాజ్​తో మార్మోగాయి. సిటీలో ఉన్న మ్యుజీషియన్లు అందర్నీ బుక్​ చేసుకున్నారు. కొన్ని వీధుల్లో అందరూ ఒకే చోట చేరి రాత్రంతా జాజ్ బ్యాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేసుకున్నారు. సిటీలోని ప్రతి శాక్సాఫోన్, ట్రంపెట్, ట్రోంబోన్, డ్రమ్, క్లారినెట్, వయోలిన్, పియానో జాజ్​ని ట్యూన్​ చేశాయి. అంతేకాదు.. జోసెఫ్ జాన్ డావిల్లా అనే మ్యుజీషియన్​​  ‘‘ది మిస్టీరియస్ ఆక్స్​మ్యాన్స్ జాజ్” పేరుతో ఒకపాట కంపోజ్ చేశాడు. ఆ మ్యూజిక్​ కాపీని చాలామంది కొనుక్కున్నారు కూడా. అయితే తన వ్యాపారం పెంచుకునేందుకు జోసెఫ్​ ఆ లెటర్​ రాశాడన్నారు కొందరు.

ఎలా చంపాడు? 

మే 23, 1918న జోసెఫ్ మాగియో తన భార్య కేథరీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి నిద్రపోతున్నప్పుడు వాళ్లపై దాడి చేశాడు. హంతకుడు ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లగానే రేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో గొంతులు కోశాడు. తర్వాత వాళ్ల తలలను బరువైన గొడ్డలితో నరికి వెళ్లిపోయాడు. 
హ్యారియెట్ లోవ్, తన లవర్​ లూయిస్ బెసుమర్ జూన్ 27, 1918న తమ కిరాణా షాపు వెనకాల దాడికి గురయ్యారు. బెసుమెర్ తన కుడి భుజంపై దాడి చేశాడు​. లోవ్ ఎడమ చెవిని ముక్కలు  ముక్కలుగా  కోశాడు. కానీ.. అదృష్టవశాత్తూ ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ.. ఈ దాడి ఆక్స్​మ్యాన్​ చేయలేదని చాలామంది అనుకున్నారు. అందుకు కారణం.. అతను దాడి చేసి ఉంటే ప్రాణాలతో వదిలేవాడు కాదని. 

అన్నా ష్నైడర్ ఆగస్టు 5, 1918న దాడికి గురైంది. ఆ టైంలో ఆమె ఎనిమిది నెలల గర్భిణి. నిద్రపోతున్న ఆమెకు ఏదో సౌండ్​ వినిపించింది.  వెంటనే నిద్రలేచింది. ఎదురుగా ఆక్స్​మ్యాన్​ కనిపించడంతో గట్టిగా అరిచింది. దాంతో తలపై గొడ్డలితో నరికి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ అరుపు విన్న చుట్టుపక్కల వాళ్లు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేర్పించడంతో బతికింది. దాడి జరిగిన రెండు రోజులకు డెలివరీ అయ్యింది. 

పౌలిన్, మేరీ బ్రూనోలను వాళ్ల మేనమామ జోసెఫ్ రొమానో చూసుకునేవాడు. అతనికి వయసు పైబడింది. ఆగస్టు10, 1918 న అందరూ ఇంట్లో ఉండగా పౌలిన్​కి పెద్ద అరుపు వినిపించింది. తన మామ గదిలోకి వెళ్లి చూస్తే.. ఒక వ్యక్తి జోసెఫ్​ని నరికి పారిపోతున్నాడు. ఆమె గొడ్డలిని పట్టుకోగలిగింది. జోసెఫ్​ తీవ్రంగా గాయపడడంతో రెండు రోజుల తర్వాత చనిపోయాడు.