రైతుల పోరాటం వల్లే సీఎం మక్కలు కొంటమన్నడు

రైతుల పోరాటం వల్లే సీఎం మక్కలు కొంటమన్నడు

ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్

హైదరాబాద్, వెలుగు: రైతుల పోరాటాలతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చిందని, మక్కలు కొంటమని సీఎం కేసీఆర్ ప్రకటించారని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ చెప్పారు. ఖరీఫ్ లో మక్కలు సాగు చేయొద్దు,  డిమాండ్ లేదు అని  కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. పంటలు పండించే విషయంలో  రైతులకు పూర్తిగా అవగాహన ఉందని,  ఏ పొలాల్లో ఏ పంటలు పండుతాయో రైతులు,  వ్యవసాయ అధికారులకు అనుభవం ఉన్నదని చెప్పారు. నియంత్రణ సాగు మంచిది కాదని రైతులు నిరూపించారని అన్నారు. రైతుల తరహాలో నిరుద్యోగులు కూడా ఉద్యోగాల కోసం పోరాటం చేయాలని, పోరాటం చేస్తేనే ఉద్యోగాలు వస్తాయని శనివారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో సంపత్ పిలుపునిచ్చారు. అన్ని వర్గాలు మేల్కొని ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో.. అట్లాగే  హామీలను నెరవేర్చు కోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలన్నారు.