కమిటీ కుర్రోళ్లు ఊపుతో వేట ప్రారంభం

కమిటీ కుర్రోళ్లు ఊపుతో వేట ప్రారంభం

‘కమిటీ కుర్రోళ్లు’ ఫేమ్ సందీప్ సరోజ్, సాత్విక జంటగా ఫణి అడపాక, జయలక్ష్మీ అడపాక నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘వేట’.  అశోక్ కోటిపల్లి దర్శకుడు. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు.  ముహూర్తపు సన్నివేశానికి కేఎస్ రవి కుమార్ క్లాప్ కొట్టగా నాగబాబు స్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మేకర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అందజేశారు.

సాయి రాజేష్, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేఎన్, వీఎన్ ఆదిత్య, ఫణి అడపాక కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మెహర్ రమేష్, యదు వంశీ, అనుదీప్ దేవ్ పాల్గొన్నారు.  పెద రాయుడు తరహా పాత్ర పోషిస్తున్నానని,  జెన్ జీ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి నచ్చేలా సినిమా ఉండబోతోందని కేఎస్ రవి కుమార్ చెప్పారు. చిరంజీవి గారి మూవీ టైటిల్ అయిన ‘వేట’ తమ సినిమా కథకు యాప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుందని హీరో సందీప్ సరోజ్ చెప్పాడు.  

అవకాశం ఇచ్చిన నిర్మాతలకు దర్శకుడు అశోక్ కోటిపల్లి  థ్యాంక్స్  చెప్పారు.  నిర్మాత ఫణి అడపాక మాట్లాడుతూ ‘‘ఈటీవీ విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి చేస్తున్న మూడో ప్రాజెక్ట్ ఇది. నా సినీ జర్నీలో సపోర్ట్ చేస్తున్న నిహారిక గారికి, అతిథిగా హాజరైన నాగబాబు గారికి థాంక్స్. ‘కమిటీకుర్రోళ్లు’ తరహాలోనే ఇది కూడా ఓ గ్రామీణ కథ. సహజత్వానికి దగ్గరగా ఉంటూనే కమర్షియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంథాలో మెప్పిస్తుంది’ అని చెప్పారు.  టీమ్ అంతా పాల్గొన్నారు.