దేశవ్యాప్తంగా మూడు రోజులుగా డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. కోల్ కతాలోని ఆర్జీకర్ మెడకల్ కాలేజీలో డాక్టర్ పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ ఆగస్ట్ 13న దేశవ్యాప్తంగా ఓపీడీ సేవలను బంద్ చేసి..నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆగస్టు 9న కోల్ కతాలోని డ్యూటీలో ఉన్న డాక్టర్ పై అత్యాచారం చేసి..హత్య చేశారు. దీంతో ఆందోళన బాట పట్టారు డాక్టర్లు.
ఆందోళనలు ఉధృతం అవ్వడంతో ఘటనకు బాధ్యతగా నిన్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ ప్రిన్సిపల్ రాజీనామా చేశారు డాక్టర్ సందీప్ ఘోష్. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు డిమాండ్ చేస్తున్నారు.
