మా గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే చేయండి

మా గ్రామంలో సమగ్ర కుటుంబ సర్వే చేయండి
  • భద్రాద్రి జిల్లా చిరిగుండంలో ఆదివాసీల ఆందోళన

భద్రాచలం,వెలుగు : రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర కుటుంబ సర్వేను తమ గ్రామంలోనూ చేపట్టాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నారాయణరావుపేట పంచాయతీ చిరిగుండంలో ఆదివాసీలు ఆదివారం ఆందోళన చేపట్టారు. తమ గ్రామం మ్యాపులో లేదంటూ.. సర్వే నుంచి అధికారులు మినహాయించారని పేర్కొన్నారు.  

30 ఏండ్ల కింద గ్రామాన్ని నిర్మించుకుని బతుకుతున్నామని, ఇప్పటికే ఆధార్, రేషన్, 100 రోజుల పని కార్డులను ప్రభుత్వం ద్వారా పొందామని, ఓటు హక్కు కూడా కల్పించారని పేర్కొన్నారు.  సర్వే నుంచి తమను మినహాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. కలెక్టర్​, ఐటీడీఏ పీవోను కలిసి సమస్యను విన్నవిస్తామని  గ్రామస్తులు తెలిపారు.