- ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై కాంగ్రెస్ చర్చలు
తెలంగాణలో ఇవాళ్టి నుంచి కాంగ్రెస్ పార్టీ రెండు రోజుల వర్క్ షాప్ నిర్వహిస్తోంది. 2 రోజుల సమావేశాల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై చర్చించనున్నారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పలు కీలక అంశాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు చర్చించి తీర్మానాలు చేయనున్నారు.
ఉదయ్ పూర్ డిక్లరేషన్ పై ఈనెల 1, 2 తేదీల్లో ఏఐసీసీ తరహాలో చింతన్ శిబిర్ ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాల పీసీసీలను కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. హైకమైండ్ ఆదేశాలతో పీసీసీ నేతలు 2 రోజుల పాటు చింతన్ శిబిర్ ఏర్పాటు చేశారు. కీసరలోని బాలవికాసలో నవ సంకల్ప్ చింతన్ శిబిర్ జరగనుంది. ఇందుకోసం పీసీసీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏఐసీసీ ఆమోదించిన 6 తీర్మానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. చింతన్ శిబిర్ విజయవంతం చేసేందుకు CLP నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన నిర్వహణ కమిటీ వేశారు. ఈ కమిటీ ఉదయ్ పూర్ డిక్లరేషన్ లో ఉన్న 6అంశాలకు సంబంధించి 6 కమిటీలను వేసింది.
ఆరు కమిటీలలో ఒక్కో కమిటీలో 30 నుంచి 40 మంది నేతలున్నారు. ఆర్గనైజేషన్ కమిటీకి పొన్నాల లక్ష్మయ్య, యూత్ కమిటీకి దామోదర రాజనర్సింహ, ఎకానమీ కమిటీకి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొలిటికల్ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అగ్రికల్చర్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సోషల్ జస్టిస్ కు వీహెచ్ లు కన్వీనర్లుగా ఉన్నారు. మొదటి రోజు సమావేశాల్లో 6 కమిటీలు సమావేశమై..వారికిచ్చిన అంశాలపై రిపోర్ట్ ప్రిపేర్ చేయనున్నారు. రెండో రోజు 6 కమిటీల కన్వీనర్లు మొదటి రోజు తయారు చేసిన రిపోర్ట్ ను భట్టి నేతృత్వంలోని చింతన్ శిబిర్ నిర్వహణ కమిటీకి అందజేయనున్నారు. చివరగా చింతన్ శిబిర్ తీర్మానాలను ఆమోదించి ఏఐసీసీకి పంపనున్నారు.
పార్టీ లో కీలకమైన నేతలకు మాత్రమే చింత న్ శిబిర్ సమావేశానికి అనుమతించనున్నారు. పీఏసీ మెంబర్స్, జిల్లాల అధ్యక్షులు, మాజీ మంత్రులు పాల్గొననున్నారు. మొత్తం దాదాపు 150 మందికి మాత్రమే పీసీసీ ఆహ్వానం పంపింది. పార్టీ అధిష్టానం తరపున ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ హాజరు కానున్నారని తెలుస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నందున ఈ సమావేశాలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్కం ఠాగూర్ తో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వం వహించనున్నారు.
మరిన్ని వార్తల కోసం..
