దేశ అప్పులు 629.1 బిలియన్ డాలర్లు

 దేశ అప్పులు 629.1 బిలియన్ డాలర్లు

న్యూఢిల్లీ : దేశ ఎక్స్‌‌టర్నల్‌‌ డెట్‌‌ (వివిధ ఫారిన్ ఇన్‌‌స్టిట్యూషన్లు, ఇతర మార్గాల ద్వారా తీసుకున్న అప్పులు)  ఈ ఏడాది జూన్‌‌ నాటికి  629.1 బిలియన్ డాలర్లుగా రికార్డయ్యింది. ఈ ఏడాది మార్చి క్వార్టర్‌‌‌‌తో పోలిస్తే జూన్ క్వార్టర్‌‌‌‌లో 4.7 బిలియన్ డాలర్లు పెరిగిందని, కానీ  జీడీపీలో ఈ అప్పుల రేషియో  తగ్గిందని  ఆర్‌‌‌‌బీఐ పేర్కొంది.  ‘జీడీపీలో దేశ  ఎక్స్‌‌టర్నల్‌‌ డెట్‌‌ రేషియో మార్చి క్వార్టర్‌‌‌‌లో 18.8 శాతం ఉండగా, జూన్ క్వార్టర్‌‌‌‌లో 18.6 శాతానికి తగ్గింది’ అని ఆర్‌‌‌‌బీఐ వెల్లడించింది. ఈ ఎక్స్‌‌టర్నల్ డెట్‌‌లో లాంగ్‌‌టర్మ్‌‌ లోన్లు (ఏడాది కంటే ఎక్కువ టెనూర్ ఉన్నవి) 505 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.