
జీహెచ్ఎంసీ లో పోలింగ్ కొనసాగుతోంది. కొన్ని పోలింగ్ చోట్ల అధికారుల పొరపాట్ల వల్ల గందరగోళంగా మారింది. ఓల్డ్ మలక్ పేటలో వార్డు 26 లో సీపీఐ గుర్తు కంకి కొడవలికు బదులు కొడవలి సుత్తి గుర్తును ముద్రించారు అధికారులు. దీంతో పోలింగ్ ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ సీపీఐ సిటీ సెక్రటరీ నరసింహ. దీంతో పోలింగ్ వద్ద ఉద్రిక్తంగా మారింది.