
హైదరాబాద్, వెలుగు: సంప్రదాయం, ఆధునిక దుస్తులు అమ్మే 'క్యూబిక్' స్టోర్‌ను హైదరాబాద్‌లో పారిశ్రామిక వేత్త పింకీ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన వస్త్రాలను, సరసమైన ధరలకు అందించాలని సూచించారు. క్యూబిక్ యజమాని గురీందర్ సింగ్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఇది తమకు రెండో స్టోర్ అన్నారు. ఈ స్టోర్ 32 వేల చదరపు అడుగుల్లో విస్తరించి ఉందన్నారు. క్యూబిక్ స్టోర్ ఓపెనింగ్ కు సినీనటి శోభితా ధూళిపాళ ముఖ్య అతిథిగా వచ్చారు.