కాళేశ్వరం దోషులను శిక్షించాలి

కాళేశ్వరం దోషులను శిక్షించాలి

 సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

 ఎల్ అండ్ టీ లేఖ బయట పెట్టాలి

తెలంగాణ జలసాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని, ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ జనసాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. అవినీతి సొమ్మును ప్రజా ఖజానాకు జమ కట్టాలని కోరారు. ఇవాళ జస్టిస్ చంద్రకుమార్, జాగో తెలంగాణ కన్వీనర్, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వానికి భజన పరులుగా ఉన్న ఇరిగేషన్ ఉన్నతాధికారులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు.  అన్నారం ,మేడి గడ్డ, సుందిళ్ల బ్యారేజీల్లో ఏది కుంగినా నిర్మాణ సంస్థదే బాధ్యత అన్నారు. ప్రజా ఖజానా నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టొద్దని అన్నారు. ప్రభుత్వానికి ఎల్ అండ్ టీ సంస్థ రాసిన లేఖను తక్షణం బయటపెట్టాటని కోరారు. ఈ రౌంట్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, ఇంజినీర్లు, సామాజిక వేత్తలు పాల్గొని తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.