గుజరాత్ లో కల్తీ మద్యం ఘటనపై కొనసాగుతున్న ‘సిట్’ దర్యాప్తు

గుజరాత్ లో కల్తీ మద్యం ఘటనపై కొనసాగుతున్న ‘సిట్’ దర్యాప్తు

గుజరాత్ లోని బోటాడ్ జిల్లాలో కల్తీ మద్యం తాగిన ఘనటలో మృతుల సంఖ్య 36కు చేరింది. ఇంకా 47 మంది వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈనెల 25న బోటాడ్ జిల్లాలోని రోజిద్ గ్రామంలో పలువురు, అహ్మాదాబాద్ జిల్లాలోని ధందుక ప్రాంతాల్లో కొందరు కల్తీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మొదట10 మంది చనిపోయారు. ఇప్పుడు మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది.

రోజిద్ సహా పలు గ్రామాల్లో కొందరు అక్రమంగా మిథైల్ ఆల్కహాల్ లో నీటిని కలిపి నాటుసారాగా విక్రయించినట్లు పోలీసులు తెలిపారు. మిథనాల్ సేవించినట్లు వారి బ్లడ్ శాంపిల్స్ అనాలైసిస్ లో తేలిందని  గుజరాత్ జీడీపీ ఆశిష్ భాటియా తెలిపారు. కల్తీ సారా అమ్మిన 14 మందిని అరెస్టు చేశామన్నారు. ఈ ఘటనలపై గుజరాత్ హోంశాఖ ముగ్గురు సభ్యులతో  సిట్ ఏర్పాటు చేసింది . సమగ్ర దర్యాప్తు జరిపి 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.