ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల విలీనానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!

ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల విలీనానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్..!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని మూడు మునిసిపల్ కార్పొరేషన్ల విలీనానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (అమెండ్మెంట్) బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. విలీన ప్రక్రియ పూర్తైన ఒకే పెద్ద మున్సిపాలిటీగా ఏర్పడనుంది. విలీన ప్రక్రియ పూర్తైన తర్వాతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి.

2011లో అప్పటి యూపీఏ సర్కారు పాలనా సౌలభ్యం కోసం ఢిల్లీ మున్సిపాలిటీని తూర్పు ఢిల్లీ, ఉత్తర ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించింది. అయితే విభజన సహేతుకంగా జరగకపోవడంతో ఆయా కార్పొరేషన్లు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాయి. చివరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మూడు కార్పొరేషన్లను విలీనం చేయాలని నిర్ణయించింది. అయితే మున్సిపాలిటీలను విలీనం చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కేంద్రంలో ఏడేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు ఇన్నాళ్లు ఆ పని ఎందుకు చేయలేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఎంసీడీ ఎన్నికల తేదీ ప్రకటనకు గంట ముందు ఈసీకి ఎందుకు లేఖ రాశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

క్షీణించిన లాలూ ప్రసాద్ ఆరోగ్యం

ఎంసెట్ షెడ్యూల్ రిలీజ్