ఒక్క ఐడీకి 5 సిమ్​లు మాత్రమే

ఒక్క ఐడీకి 5 సిమ్​లు మాత్రమే

ఒక్క ఐడీకి 5 సిమ్​లు మాత్రమే

కేవైసీ పద్ధతి పూర్తిగా డిజిటలైజేషన్

న్యూఢిల్లీ : నకిలీ సిమ్ కార్డులను అరికట్టేందుకు డిపార్ట్​మెంట్​ ఆఫ్​ టెలి కమ్యూనికేషన్స్  (డాట్​) నో యువర్ -కస్టమర్ (కేవైసీ) పద్ధతిలో కొన్ని మార్పులు చేయాలని భావిస్తోంది. నేషనల్​ మీడియాలో వచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఒక ఐడీపై ఇప్పుడు తొమ్మిది సిమ్​ కార్డ్‌‌లు ఇస్తుండగా, ఇక నుంచి వీటి సంఖ్యను ఐదుకి తగ్గించే అవకాశాలు ఉన్నాయి.  కేవైసీ పద్ధతిని పూర్తి డిజిటలైజ్​చేస్తారు.  ప్రస్తుతం యూఐడీఏఐ నుండి తీసుకున్న ఫొటోతో పాటు కస్టమర్ ఆధార్​ వివరాలతో ఈ–కేవైసీ పూర్తి చేసి సిమ్​కార్డు ఇస్తున్నారు.  

ఈ విధానానికి బదులు సెల్ఫ్​–కేవైసీ పద్ధతి రానుంది. ఈ విధానంలో కస్టమర్ ప్రత్యామ్నాయ మొబైల్ నంబర్​తో సర్వీస్ ప్రొవైడర్​ దగ్గర రిజిస్టర్​ చేసుకోవాలి. దీనికోసం కుటుంబం / బంధువులు / తెలిసిన వ్యక్తుల మొబైల్ నంబర్‌‌‌‌ను కూడా ఉపయోగించవచ్చు.  సంబంధిత మొబైల్ నంబర్‌‌‌‌కు ఓటీపీ పంపడం ద్వారా కస్టమర్​ వివరాలను వెరిఫై చేస్తారు. ఎలక్ట్రానిక్‌‌‌‌గా వెరిఫై చేసిన  పీఓఐ/పీఓఏ డాక్యుమెంట్లను  మాత్రమే సబ్‌‌‌‌స్క్రైబర్ వెరిఫై చేస్తారు. వెరిఫికేషన్​ కోసం ఆధార్‌‌‌‌ను ఉపయోగిస్తే, కస్టమర్ల నుంచి డిక్లరేషన్ తీసుకుంటారు.