బుద్ధవనం ప్రాజెక్ట్ ను కేటీఆర్ ఓపెన్ చేస్తారా?

V6 Velugu Posted on May 14, 2022

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లోని బుద్ధవనం ప్రాజెక్ట్ ఓపెనింగ్ పై అధికారుల్లో డైలమా కొనసాగుతోంది. ఇవాళ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా బుద్ధవనం ప్రాజెక్ట్ ఓపెనింగ్ ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత ప్రారంభోత్సవం ఉండదని... కేవలం పరిశీలన మాత్రమే ఉంటుందని అధికారిక షెడ్యూల్ లో పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రారంభోత్సావానికి ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో బుద్ధవనం ప్రాజెక్ట్ ఓపెనింగ్ కు ఏర్పాట్లు చేశారు. అయితే నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ బుద్ధవనం ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తారా లేదా అనేది... క్లారిటీ లేదంటున్నారు. 

తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో ఇవాళ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ దగ్గర బుద్ధవనం ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపలేదని ట్వీట్ చేశారు కేంద్ర టూరిజం మినిస్టర్ కిషన్ రెడ్డి. ఈ ప్రాజెక్టు కింద కేంద్రం 22 కోట్ల 24 లక్షలు కేటాయించిందన్నారు. టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి.. కేంద్ర మంత్రికే పిలుపు లేదంటూ ఆహ్వాన పత్రాన్ని కిషన్ రెడ్డి ట్విట్టర్ లో ట్యాగ్ చేశారు.

Tagged Arrangements, Minister KTR, Authorities, dilemma, Inauguration, Buddhavanam project, Nagarajuna sgar

Latest Videos

Subscribe Now

More News