పులుల మధ్య తిరుగుతున్న శునకం

పులుల మధ్య తిరుగుతున్న శునకం

నాన్న పులులే గుంపులుగా వస్తాయి..కానీ తాను మాత్రం సింగల్గా వస్తానంటోంది ఓ శునకం.  పులులను ఏమాత్రం లేక్కచేయకుండా..వాటి మధ్య దర్జాగా తిరుగుతోంది.  తమ మధ్య గ్రామ సింహం  గంభీరంగా తిరుగుతున్నా..ఆ పెద్దపులులు మాత్రం ఏమీ అనడం లేదు.  పులులు కొట్లాడుకుంటున్నా..ఆ కుక్కలో ఏ మాత్రం భయంలేదు. పైగా ఈ  దృశ్యాలను వీడియో తీస్తున్న వారిపై భౌ.. భౌ అంటూ మొరుగుతోంది.  ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారి.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Tiger (@tiger__bigfan)


 
ఏం చేయకుండా ఎందుకు వదిలేసాయో తెలుసా?
టైగర్స్ గుంపులో భయం లేకుండా తిరుగుతున్న ఈ శునకం గోల్డెన్ రెట్రైవర్ బ్రీడ్కు చెందినది. అయితే ఆ పులులు చిన్న కూనలుగా ఉన్నప్పుడే తల్లికి దూరం అయ్యాయి. అప్పటి నుంచి ఈ శునకమే వాటికి పాలిచ్చి పెంచింది. దీంతో  టైగర్స్  కుక్కను అమ్మగా భావిస్తున్నాయి. అందుకే  ఆ గ్రామ సింహం అన్ని  పులుల మధ్య దర్జాగా భయపడకుండా తిరిగేస్తుంది. 

ఫన్నీ కామెంట్స్..
సోషల్‌ మీడియాలో ఈ వీడియో విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా 1.3 మిలియన్ల మంది వీక్షించారు.  50 వేలకుపైగా లైక్స్ కొట్టారు.  ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.  శునకానిది ఏమి దర్జా.. అంటూ కొందరు.. పులుల గుంపునే ఆ శునకం కాపలాగా పెట్టుకుందంటూ మరికొందరు కామెంట్స్ పెట్టారు.