పండుగ రోజు వేసుకునే డ్రెస్​ ట్రెడిషనల్​గా ఉండాలి

పండుగ రోజు వేసుకునే డ్రెస్​ ట్రెడిషనల్​గా ఉండాలి

దీపాల వెలుగుల్లో మరింత అందంగా కనిపించాలంటే.. పండుగ రోజు వేసుకునే డ్రెస్​ ట్రెడిషనల్​గా ఉండాలి.  ట్రెడిషనల్​గా కనిపించడమే కాకుండా ఫ్యాషనబుల్ డ్రెస్​లు అయితే ఇంకా బాగుంటాయి అనుకుంటారు చాలామంది అమ్మాయిలు. ఎందుకంటే.. మేకప్​, నగలతో పాటు డ్రెస్సింగ్ కూడా ట్రెండీగా ఉంటే లుక్ బాగుంటుంది. అందుకోసం.. పువ్వుల డిజైన్లు, ధోతి కుర్తీలు, పేస్టల్ కలర్ చీరలు, ఎంబ్రాయిడరీ ఎథ్నిక్ జాకెట్, పెప్పీ పలాజో వంటివి ఎంచుకోవచ్చు.

ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ అనార్కలీ డ్రెస్​ మీదకు తెలుపు, పసుపు, గులాబీ రంగులో ఉన్న చెవి కమ్మలు చాలా బాగుంటాయి. పూల కొమ్మలు అంచులుగా ఉన్న చీర కట్టుకుంటే  ఫ్లాట్​గా, డిజైన్లు ఉన్న జుట్టీస్ (షూ లాంటివి)​ వేసుకోవాలి. కుర్తీలో కూడా వెరైటీలు ఉన్నాయి. ధోతి కుర్తీలో స్టయిలిష్​గా కనిపిస్తారు.  ఈ డ్రెస్​ మీదకి  వేలాడే కమ్మలు పెట్టుకోవాలి. రంగురంగుల్లో ఎంబ్రాయిడరీ డిజైన్లు ఉన్న పెప్పీ పలాజో కూడా మంచి ఛాయిస్.  అబ్బాయిలకు  ప్రింటెడ్ కుర్తా, ధోతి కుర్తా వంటివి బాగుంటాయి. వీటి ధర. 1400 రూపాయల నుంచి మొదలవుతుంది. డిజైన్, రకం బట్టి ధరలో తేడా ఉంటుంది.