
మహబూబాబాద్ జిల్లా : పల్లె ప్రగతి రెండో విడత కార్యక్రమాన్ని అన్ని గ్రామాల ప్రజలు విజయవంతం చేయాలని కోరారు ఎమ్మెల్యే రెడ్యా నాయక్. పల్లె ప్రగతి రెండో విడతలో భాగంగా మంగళవారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలలోని ఉగ్గంపల్లి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే.. చెత్త రిక్షా తొక్కుతూ గ్రామాల్లో చెత్త లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలి కోరారు.
జనవరి రెండు నుంచి పల్లే ప్రగతి కార్యక్రమంలో గతంలో మిగిలిన పనులన్ని పూర్తి చేసి, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.