రంజాన్‌‌ ఉపాధిపై కరోనా దెబ్బ

రంజాన్‌‌ ఉపాధిపై కరోనా దెబ్బ

50 వేల మంది చిరువ్యాపారులపై ఎఫెక్ట్​
పెద్ద షాపులదీ అదే పరిస్థితి
ఏటా రాత్ బజార్​లో రూ.కోట్లల్లో బిజినెస్
లాక్​డౌన్‌‌తో ఆదాయం లేక షాపింగ్ చేయలేకపోతున్న ముస్లింలు

హైదరాబాద్, వెలుగు:రంజాన్ అంటే ఏడాదికొకసారి వచ్చే పండుగ మాత్రమే కాదు, కొన్ని వేల కుటుంబాల కడుపు నింపే ఉపాధి. ఆ నెల రోజులు ఓల్డ్ సిటీలో ఉండే సందడి అంతాఇంతా కాదు. చార్మినార్ పరిసరాల్లోకి అడుగుపెట్టాలంటే వెహికల్​ను కిలోమీటర్ దూరంలో పార్క్ చేయాల్సిందే. రాత్ బజార్​కి హిందూ, ముస్లిం తేడా లేకుండా ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కానీ, కరోనా ఎఫెక్ట్​తో ఈసారి పాతబస్తీ కళ తప్పింది. లాక్​డౌన్ రిలాక్సేషన్స్​తో కొన్ని ఓపెన్ చేసినా చేతిలో పైసల్లేక ఎవరూ పెద్దగా షాపింగ్ చేయడం లేదు. దాంతో రంజాన్ సీజన్ బిజినెస్ పై ఆధారపడ్డ వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి.

అన్ని బిజినెస్‌‌లూ డల్ ..

రంజాన్ నెలలో చార్మినార్ డిపో నుంచి మదీనా సర్కిల్ వరకు వచ్చిపోయే వెహికల్స్, జనాలతో రద్దీగా ఉండేవి. రోడ్డుకు రెండువైపులా షాపులు, వాటి ముందు తోపుడు బండ్ల కొనుగోళ్లతో కిటకిటలాడేవి. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, మసాలా దినుసులు, సేమియా, బట్టలు, బుర్ఖాలు, ఖురాన్లు, ఖురాన్ స్టాండ్స్, అత్తర్, సుర్మా, టోపీలు, కాస్మొటిక్స్, హౌస్ హోల్డింగ్స్ ఇలా అన్ని బిజినెస్‌‌లూ ఫుల్ గా నడిచేవి. ప్రస్తుతం ఓల్డ్ సిటీలో ఆ సీన్ కనిపించడం లేదు. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సరి, బేసి సిస్టమ్ లో షాప్‌‌లు తెరిచినా కొనడానికి పెద్దగా జనం రాట్లేదని ఓనర్లు చెప్తున్నారు. రంజాన్‌‌కి 2 నెలల ముందు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి స్టాక్ తెప్పించుకునేవాళ్లమని, ఈసారి కరోనా ఎఫెక్ట్‌‌తో ట్రాన్స్‌‌పోర్ట్ లేకపోవడం వల్ల ఓల్డ్ స్టాక్‌‌నే అమ్ముతున్నామని తెలిపారు. తోపుడు బండ్లు పెట్టే 50 వేల మందికి పైగా చిరువ్యాపారులు ఈ నెలలో లక్షకు పైగా ఆదాయం పొందేవారు. ప్రస్తుతం ఇళ్ల గడవని పరిస్థితి ఉందని వారు ఆవేదన చెందుతున్నారు. ఓల్డ్ సిటీలో కొన్ని కుటుంబాలు చేసే సేమియా బేగంబజార్, చార్మినార్‌‌తోపాటు జిల్లాలకు ఎక్స్ పోర్ట్ అవుతుంది. లాక్​డౌన్​తో సగానికి సగం ఆర్డర్లు ఆగిపోయాయని తయారీదారులు వాపోతున్నారు.

చివరి శుక్రవారం..ఇండ్లల్లోనే ప్రార్థనలు

ఏటా రంజాన్ నెల చివరి శుక్రవారం మక్కామసీదులో వేల మంది ప్రార్థనలు చేస్తుంటారు. ఈసారి లాక్​డౌన్ ఎఫెక్ట్ తో సిబ్బంది ఐదుగురు మాత్రమే పాల్గొన్నారు. ఎక్కువమంది ఇండ్లల్లో, కొద్దిమంది షాపుల్లో ప్రార్థనలు చేసుకున్నారు.
ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు
20 ఏండ్లుగా చార్మినార్ దగ్గర బండి పెట్టుకుని గాజులు, కాస్మొటిక్స్ అమ్ము తున్నం. రంజాన్ టైమ్ లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలే. ఉన్న స్టాక్ అమ్ముదామన్నా కస్టమర్లు వస్తలేరు. – జాఫర్, చిరువ్యాపారి, ఓల్డ్ సిటీ

2 శాతం బిజినెస్ కూడా కాలే
రంజాన్​లో ఫుల్ బిజినెస్ ఉంటుండే. ఈసారి 2 శాతం కూడా లేదు. మార్కెట్ మొత్తం డౌన్ అయ్యింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు షాప్​ తీసి ఉంచుతున్నా.. ఎవరూ రాట్లేదు. –అబిద్, వ్యాపారి, మదీనా సర్కిల్

వైరస్ నుంచి బయటపడాలె
ఇన్నేండ్లలో ఇలాంటి రంజాన్ చూడనే లేదు. బాధగా ఉంది. కానీ, కరోనా వల్ల మనుషులకు మనుషుల విలువ తెలి సింది. తొందరగా ఈ పరిస్థితి నుంచి కోలు కోవాలని కోరుకుందాం.  –మహ్మద్ వహీద్, సదర్, షాపూర్ మసీదు

మరిన్ని వార్తల కోసం

రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

పడిపోయిన టమాట రేటు