డెల్టా వేరియంట్ ప్రభావం తగ్గింది

డెల్టా వేరియంట్ ప్రభావం తగ్గింది
  • ఎన్‌టీఏజీఐ హెడ్ ఎన్‌కే అరోరా వెల్లడి
  • ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో పిల్లలకూ వ్యాక్సిన్
  • ఇకపై టీకాల కొరత ఉండబోదని కామెంట్
  • ఎన్‌‌‌‌‌‌‌‌టీఏజీఐ హెడ్ ఎన్‌‌‌‌‌‌‌‌కే అరోరా

న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరగడానికి కారణమైన డెల్టా వేరియంట్​కు సంబంధించి సైంటిస్టులు గుడ్‌‌‌‌‌‌‌‌ న్యూస్ చెప్పారు. ప్రస్తుతం దాని ప్రభావం తగ్గిందని తెలిపారు. ‘‘టీకా డోసుల మధ్య గ్యాప్​ను పరిశీలిస్తున్నాం. 3, 4 నెలల్లో దానిపై డేటాను రివ్యూ చేస్తాం. డెల్టా వేరియంట్ ప్రభావానికి సంబంధించినంత వరకు..దేశంలో పీక్, వరస్ట్ స్టేజ్ ముగిసింది’’ అని నేషనల్ టెక్నికల్ అడ్వైజర్ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఇన్ ఇండియా(ఎన్‌‌‌‌‌‌‌‌టీఏజీఐ) హెడ్, డాక్టర్ ఎన్‌‌‌‌‌‌‌‌కే అరోరా చెప్పారు. డెల్టా వేరియంట్ ప్రస్తుతం 60 దేశాల్లో వ్యాప్తి చెందింది. దీని ప్రభావం నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం.. అన్ లాక్ ప్లాన్లను ఈ నెలంతా వాయిదా వేసింది. ‘‘కొవాక్సిన్ డెవలప్​మెంట్,  ఇన్ఫెక్షన్ రేట్లు కొవిషీల్డ్ మాదిరే ఉంటాయి. భారత్ బయోటెక్ ఫేజ్ 3 క్లినికల్ ట్రయల్స్ రా డేటాను మేం చూశాం. డేటా అందుబాటులో ఉంది. పబ్లిష్ చేసేందుకు రెడీగా ఉందని నేను నమ్ముతున్నా” అని వివరించారు. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో పిల్లలకు వ్యాక్సిన్ వేసే అవకాశం ఉందని చెప్పారు. రానున్న రోజుల్లో వ్యాక్సిన్ కొరత ఉండదని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘మనం వ్యాక్సినేషన్​లో తర్వాతి స్టేజ్​కు వచ్చాం. షార్టేజ్ అనే మాటే ఇక వినిపించదు’ అని వివరించారు.