స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషకరం

 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషకరం

సింగరేణి యాజమాన్యం కార్మికుల పిల్లలకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో సింగరేణి యాజమాన్యం ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 

పబ్లిక్ సెక్టార్ సంస్థలలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే చాలా సమయం పడుతుందని సింగరేణి మాత్రం కార్మికుల పిల్లలు కోసం స్పీడ్ గా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు చొరవచూపిందని తెలిపారు. సింగరేణి సీఎండీ బలరాం నాయక్ కారణంగా సెంటర్ అందు బాటులోకి వచ్చిందని వివేక్ వెంకటస్వామి చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని కోర్సులపై శిక్షణ ఇచ్చి కోల్ బెల్ట్ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలను చూపాలని కోరారు.

 సింగరేణిలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగానే సింగరేణి సీఎండీ ద్వారా ఆదేశాలు ఇప్పించారని తెలిపారు. సింగరేణి యాజమాన్యం టెండర్లు పాల్గొని కేకే-6, శ్రావణపల్లి భూగర్భ గనులతో పాటు మరికొన్ని గనులను అందుబాటులోకి తీసుకొచ్చి బొగ్గు ఉత్పత్తి పెంచడంతోపాటు ఎక్కువమందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందన్నారు.