
హైదరాబాద్ లో ఒకే రోజు మూడు వేర్వేరు చోట్ల భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు అధికారులు. ఆగస్టు 7న ఉదయం శంషాబాద్ లో బ్రౌన్ షుగర్ , శేర్లింగంపల్లిలో ఎండీఎంఏ, ఘట్ కేసర్ లో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.
శంషాబాద్లో 70 గ్రాముల బ్రౌన్ షుగర్ పట్టుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. బెంగాల్ నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నట్లు గుర్తించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు
బెంగళూరు నుంచి ఇద్దరు వ్యక్తులు ఎండీఎంనే తీసుకొచ్చి కడపకు చెందిన గుత్తా తేజ కృష్ణకు అమ్ముతుండగా.. శేర్లింగంపల్లిలో ఎస్ టి ఎఫ్ డి టీం సిఐ నాగరాజు టీం పట్టుకున్నారు. వీళ్ల నుంచి 5.14 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను డ్రగ్స్ ను శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. మరో కేసులో మహేష్ రెడ్డి మల్కాజిగిరి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి వద్ద నుంచి 510 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొని స్టేషన్లో అప్పగించారు.
ఘట్ కేసర్ లో 1.227 కేజీల గంజాయిని పట్టుకున్నారు అధికారులు. నాగపూర్ నుంచి బస్సులో గంజాయి వస్తుందనే ముందస్తు సమాచారం మేరకు ఎస్ టి ఎఫ్ సి టీం సీఐ వెంకటేశ్వర్లు నాగపూర్ నుంచి వస్తున్నటువంటి బస్సులను కొంపెల్లి, బాలాజీ నగర్, జవహర్ నగర్ ఘట్కేసర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఘట్కేసర్ ప్రాంతంలో నాగపూర్ నుంచి వచ్చినటువంటి బస్సులో ప్రభు రాజ్ అనే వ్యక్తి దగ్గర 1.227 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి నిందితుడిని ఘట్ కేసర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్టు హెచ్ డి ఎఫ్ బీ టీమ్ ఎస్సై బాలరాజు తెలిపారు. ఈ కేసుల్లో గంజాయిని డ్రగ్స్ పట్టుకున్నటువంటి సిబ్బందిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షాన్వాస్ కాసిం బీ టీం లీడర్ ప్రదీప్ రావులు అభినందించారు.