HarrisJayaraj: టాలీవుడ్‌కు హారిస్ జయరాజ్ సాలిడ్ కమ్ బ్యాక్.. కొత్త సాంగ్ విన్నారా?

HarrisJayaraj: టాలీవుడ్‌కు హారిస్ జయరాజ్ సాలిడ్ కమ్ బ్యాక్.. కొత్త సాంగ్ విన్నారా?

నాగశౌర్య, విధి జంటగా రామ్ దేశినా (రమేష్‌) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న  యాక్షన్‌ ఎంటర్‌‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్‌పై  శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవగా, తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. శుక్రవారం (AUG8న) మొదటి పాటను విడుదల చేశారు.

సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ ఈ చిత్రంతో టాలీవుడ్‌కు కమ్ బ్యాక్ ఇస్తూ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ‘నా మావ పిల్లనిత్తానన్నాడే.. నేనే నెత్తిమీద బెల్లమెట్టి అయితనింక అల్లుడే..’అంటూ కాసర్ల శ్యామ్ క్యాచీ లిరిక్స్ రాయగా, కారుణ్య, హరి ప్రియ పాడిన తీరు ఆకట్టుకుంది.

విజయ్ పొలాకి కొరియోగ్రఫీలో హీరో హీరోయిన్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్‌తో పాటు విజువల్స్ కలర్‌‌ఫుల్‌గా ఉన్నాయి. సముద్రఖని, నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, బ్రహ్మాజీ, పృథ్వీ, సుదర్శన్, కృష్ణుడు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

హారిస్ జయరాజ్ సినిమాలు:

హారిస్ జయరాజ్ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలకు సంగీతం ఇస్తూ స్టార్ పొజిషన్ లో ఉన్నారు. తెలుగులో వాసు, ఘర్షణ, సైనికుడు, మున్నా, చెలి, అపరిచితుడు, గజిని, సూర్య సన్ ఆఫ్ క్రిష్ణన్, వీడొక్కడే, ఘటికుడు, ఆరెంజ్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

►ALSO READ | Anjali: అంజలి లేడీ ఓరియెంటెడ్‌‌ మూవీ షురూ.. డైరెక్టర్ ఎవరంటే?

ఈ సంగీత దిగ్గజం కంపోజ్ చేసిన ఎన్నో పాటలు ఇప్పటికీ.. తెలుగు శ్రోతల్ని వీపరీతంగా అలరిస్తున్నాయి. తెలుగులో చివరగా 2023లో వచ్చిన నితిన్ ఎక్స్‌ట్రా సినిమాతో వచ్చారు. ఆ తర్వాత కాస్తా గ్యాప్ ఇచ్చి.. త్వరలో ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KS Talkies (@ks_talkies)