బొబ్బిలిలో పేలుడు..నేలమట్టమైన 3 ఇళ్లు

బొబ్బిలిలో పేలుడు..నేలమట్టమైన 3 ఇళ్లు

ఏపీ విజయనగరం జిల్లా బొబ్బిలిలోని దేవాంగుల వీధిలో జిలిటెన్ స్టిక్స్ పేలి, రెండు పెంకుటిల్లు, ఒక రేకుల ఇల్లు నేలమట్టమయ్యాయి. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.మూడు బైకులు ధ్వంసమయ్యాయి. జిలిటెన్ స్టిక్స్ తీసుకొచ్చి ఇళ్ల మధ్య నిల్వ ఉంచిన గెంబలి శ్రీను పేలుడు జరిగిన వెంటనే పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. మరో ముగ్గురు కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.