రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family star). మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమాను దర్శకుడు పరశురామ్(Parasuram) తెరకెక్కించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. మొదటిరోజు కలెక్షన్స్ కేసుల సాలిడ్ గానే రాబట్టింది ఈ మూవీ.
Families are celebrating #TheFamilyStar in theatres ❤️🔥
— Sri Venkateswara Creations (@SVC_official) April 6, 2024
The team will now celebrate the FAMILY STARS in real life ❤️
Fill the form below and tell us who your FAMILY STAR is. And get ready for a surprise visit by the team ✨
📜 https://t.co/tvTkPpZev7
Book your tickets for the… pic.twitter.com/mCgiwHAKJw
ఇక ది ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తున్న క్రమంలో చిత్ర యూనిట్ ఆడియన్స్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అదేంటంటే.. ది ఫ్యామిలీ స్టార్ టీం ఆడియన్స్ ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీ స్టార్ ను సర్ ప్రైజ్ చేస్తారట. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు మాత్రమే ఈ గొప్ప అవకాశం దక్కనుంది. ఇందుకోసం ఆడియన్స్ ఒక ఫార్మ్ ఫిలిప్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ లో.. పేరు, అడ్రస్, మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు, ఎందుకు అనే ప్రశ్నలకు ఆన్సర్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. వారిలో సెలెక్ట్ అయినవారి ఇంటికి హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ మృణాల్ ఠాకూర్, దర్శకుడు పరశురామ్, నిర్మాత దిల్ రాజు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ స్టార్ తో టైం స్పెండ్ చేయనున్నారు. మరి ఆలస్యం ఎందుకు మీరు కూడా ఫ్యామిలీ స్టార్ స్టార్స్ మీ ఇంటికి వచ్చే అవకాశాన్ని దక్కించుకోండి.