
నర్సాపూర్, వెలుగు : పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతు విద్యుత్ షాక్‌తో చనిపోయాడు. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం మాడాపూర్ గ్రామంలో శనివారం జరిగింది. మాడాపూర్ గ్రామానికి చెందిన నవపేట భిక్షపతి (45) తన పొలానికి నీళ్లు పారించేందుకు కొడుకు చరణ్‌తో కలిసి శనివారం వెళ్లాడు. బోరు దగ్గర ఉన్న సర్వీస్ వైర్‌ను తీసి పక్కకు వేస్తుండగా షాక్ కొట్టి పడిపోయాడు. గమనించిన కొడుకు చరణ్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పారు. వారు వచ్చి భిక్షపతి ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడి భార్య నర్సమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పుష్పరాజ్ చెప్పారు.