ప్రేమించొద్దని చెప్తే వినలేదని.. కొడుకు బైక్​ తగలెట్టిన తండ్రి

ప్రేమించొద్దని చెప్తే వినలేదని.. కొడుకు బైక్​ తగలెట్టిన తండ్రి

మరో ఏడు వాహనాలకూ నిప్పు

చెన్నైలో ఘటన.. ఆలస్యంగా వెలుగులోకి

చెన్నై: ప్రేమా, గీమా వద్దు బిడ్డా.. ఆ పిల్లను వదిలెయ్​ అని తండ్రి బుజ్జగించి చెప్పిండు. అయినా వినకుండా కొడుకు ఆ పిల్లతో బైక్​ మీద కన్పించేసరికి కోపంతో రగిలిపోయిండు. తను కొనిచ్చిన బైక్​ను తనే తగలబెట్టిండు. చెన్నైలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు.. సిటీకి చెందిన కర్ణన్​ ఓ ఆటో రిక్షా డ్రైవర్. కొడుకు అరుణ్​ను కష్టపడి చదివించి, ఉద్యో గస్తుడిని చేసిండు. ప్రేమతో ఓ బైక్​ కూడా కొనిపెట్టిండు. అయితే, కొడుకు ప్రేమను మాత్రం అంగీకరించలే. ఆ అమ్మాయిని కలవొద్దని కొడుకుకు ఆర్డరేసిండు. ఆ కొడుకూ తగ్గలే, ఏకంగా గర్ల్​ఫ్రెండ్​తో లివిన్​ రిలేషన్​ షిప్​ మొదలెట్టిండు. ఒకరోజు ఆ పిల్లను వెంటేసుకుని తిరుగుతూ తండ్రి కండ్లబడ్డడు. ఇంకేముంది, కర్ణన్​కు మస్తు కోపమొచ్చింది. కొడుకుకు బుద్ధి చెప్పాల్సిందేనని డిసైడ్​అయిండు. ఓ మందు బాటిల్, పెట్రోల్​ బాటిల్​ పట్టుకుని కొడుకు ఉండే చోటుకు పోయిండు. మందునేమో గొంతులో పోసుకుని.. పెట్రోల్​ను బైక్​ పై పోసి నిప్పంటించిండు. ఇదంతా యాక్సిడెంట్​లా కన్పించాలని పక్కనే పార్క్​ చేసిన మరో ఏడు బైకులనూ తగలెట్టిండు. తర్వాత బాటిల్​ అక్కడే పారేసి పరారైండు. బైక్​లు తగలబడడం, పక్కనే పెట్రోల్​ బాటిల్​ ఉండడంతో ఆ బైక్​ల ఓనర్లు పోలీసులకు కంప్లైంట్​ చేశారు. కొడుకు ప్రియురాలు మాత్రం కర్ణన్​పై అనుమానం వ్యక్తం చేసింది. తన కొడుకును వదిలేయకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కొంతకాలంగా కర్ణన్​ బెదిరిస్తున్నాడని, ఈ పని అతడే చేసి ఉండొచ్చని చెప్పింది. దీంతో పరారీలో ఉన్న కర్ణన్​ను రెండు నెలల తర్వాత పోలీసులు పట్టుకున్నారు. విచారణలో బైక్​లను తగలబెట్టింది తనేనని ఒప్పుకున్నడు. పోలీసులు కేసు నమోదు చేసి, కర్ణన్​ ను రిమాండ్​కు పంపించారు.