
జగిత్యాల జిల్లా: కన్న కొడుకును తండ్రి దారుణంగా హత్య చేసిన సంఘటన ఆదివారం జగిత్యాల జిల్లాలో జరిగింది. ధర్మపురి మండలం జైన గ్రామంలో కన్న కొడుకు గుడ్ల సత్యనారాయణ(35)ను గొడ్డలితో హత్యచేశాడు తండ్రి పోశరాజం. కుటుంబ కలహాలతోనే చంపి ఉంటాడని తెలుస్తోంది. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.