అట్లూరి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’

అట్లూరి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’

ఉదయ్ శంకర్, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ జంటగా గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘నచ్చింది గర్ల్ ఫ్రెండూ’. శుక్రవారం సినిమా విడుదలవుతోన్న సందర్భంగా నిర్మాత నారాయణరావు మాట్లాడుతూ ‘ఉదయ్ నటించిన ఆటగదరా శివ, మిస్ మ్యాచ్, క్షణ  క్షణం చిత్రాలు చూసి ఆయనతో మంచి థ్రిల్లర్ మూవీ చేయాలనిపించింది. గురు పవన్ చెప్పిన కథ మాకు నచ్చింది. కేవలం థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌‌‌‌‌‌‌‌తో కాకుండా లవ్‌‌‌‌‌‌‌‌స్టోరీ, కామెడీ, రొమాన్స్ కూడా బాగా డీల్ చేశాడు. యువతకు కొన్ని లక్ష్యాలు, బాధ్యతలు, దేశం పట్ల ప్రేమ ఉండాలని చూపించాం. ఉదయ్ రాజారాం పాత్రలో ఆకట్టుకుంటాడు. హీరోయిన్ జెన్నిఫర్, మధు నందన్.. ఈ మూడు పాత్రల మధ్యే మేజర్ సినిమా సాగుతుంది. మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే ఉదయ్‌‌‌‌‌‌‌‌తో మరో మూవీ,  అలాగే నారా రోహిత్‌‌‌‌‌‌‌‌తో పాటు ఓ పెద్ద హీరోతోనూ సినిమాలు ప్లాన్ చేస్తున్నాం’ అని చెప్పారు.