
వరంగల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన లవ్‌స్టోరీ ‘ఊరికి ఉత్తరాన’. నరేన్, దీపాలి జంటగా నటించారు. సతీష్ పరమవేద దర్శకుడు. వనపర్తి వెంకటయ్య నిర్మాత. నవంబర్ 19న సినిమా విడుదలవుతున్న సందర్భంగా నరేన్ మాట్లాడుతూ ‘రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించిన ఫిక్షన్ మూవీ. విలేజ్‌లో జరిగే కథ. వరంగల్ సెట్ ప్రత్యేక ఆకర్షణ’ అన్నాడు. ‘కంటెంట్ బేస్డ్ సినిమా. కచ్చితంగా మెప్పిస్తుంది’ అన్నాడు డైరెక్టర్. ‘చాలా కొత్త కథ, ‘ఫస్ట్ మూవీలోనే యాక్టింగ్‌కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ చేసినందుకు హ్యాపీగా ఉంది’ అంది దీపాలి. నిర్మాతతో పాటు కో–ప్రొడ్యూసర్ రాచాల యుగంధర్, నటుడు ఫణి తదితరులు పాల్గొన్నారు.