బడ్జెట్ కసరత్తును ప్రారంభించిన ఫైనాన్స్ డిపార్ట్​మెంట్

బడ్జెట్ కసరత్తును ప్రారంభించిన ఫైనాన్స్ డిపార్ట్​మెంట్
  • అన్ని శాఖల నుంచి అందిన వివరాలు 
  • 2023-24 బడ్జెట్ పై కసరత్తు షురూ 

హైదరాబాద్, వెలుగు: రానున్న ఆర్థిక సంవత్సరం 2023–24కు  సంబంధించిన బడ్జెట్ కసరత్తును ఫైనాన్స్ డిపార్ట్​మెంట్ ప్రారంభించింది. ఇప్పటికే అన్ని డిపార్ట్​మెంట్ల నుంచి ఆన్​లైన్​లో ప్రపోజల్స్​ను స్వీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జరిపిన కేటాయింపులు.. వచ్చే ఏడాదికి సంబంధించిన అంచనాలపై అన్ని శాఖల సెక్రటరీలతో ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు చర్చించారు. కొత్త పథకాలు, ఏదైనా స్కీముకు పెంచాల్సిన బడ్జెట్​ అంచనాలపై మంత్రి హరీశ్​రావుతో ఎంసీహెచ్ఆర్డీలో గురువారం స్పెషల్​ సీఎస్​ భేటీ అయ్యారు. 2022–23లో రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టారు.

ఎన్నికల ఏడాది అయినప్పటికీ ఈసారి కూడా ఫుల్ బడ్జెట్​ పెడుతున్నారు. డిసెంబర్ వరకు అవకాశం ఉండటం, అప్పటికి కేవలం 3 నెలలే మిగిలి ఉండటంతో పూర్తిస్థాయి బడ్జెట్ పెడుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అనుకున్న అప్పులను సమకూర్చుకోలేదు. ఇష్టారీతిన అప్పులు చేయడంతో కేంద్రం, ఆర్బీఐ కోత పెట్టాయి. దీంతో ఈ సారి ఆచితూచి ప్రపోజల్స్ పెట్టనున్నట్లు తెలిసింది.  డిపార్ట్​మెంట్ల నుంచి గతం కంటే దాదాపు 20% మేర బడ్జెట్ పెంపునకు ప్రపోజల్స్​ రాగా, దానిని 5–10 శాతానికి పరిమితం చేయాలని ఆర్థిక శాఖ భావిస్తోంది.