రైతులకు గుడ్ న్యూస్ : మోదీ తొలి సంతకం రూ.20 వేల కోట్ల విడుదలపైనే..

రైతులకు గుడ్ న్యూస్ : మోదీ తొలి సంతకం రూ.20 వేల కోట్ల విడుదలపైనే..

ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. తొలి సంతకం చేశారు. దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 20 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పీఎం కిసాన్ యోజన కింద 17వ విడత నిధులను విడుదల చేస్తూ సంతకం చేశారు మోదీ. దేశవ్యాప్తంగా 9 కోట్ల 30 వేల మంది రైతుల ఖాతాల్లో.. ఒక్కక్కొరికి 2 వేల రూపాయల చొప్పున వారి వారి బ్యాంకుల్లో పడనున్నాయి డబ్బులు.  ఈ సందర్బంగా మాట్లాడిన మోదీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రైతుల కోసం, వ్యవసాయ రంగం కృషి కోసం మరింత కృషి చేస్తామని చెప్పారు మోదీ. 

2024, జూన్ 10వ తేదీ ఉదయం ఢిల్లీలో మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు మోదీ. ప్రధాని మోదీ జూన్ 10 న సాయంత్రం 5 గంటలకు తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.  ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉంది.