ట్రాన్స్జెండర్ పాత్రలో సుస్మితా సేన్

ట్రాన్స్జెండర్ పాత్రలో సుస్మితా సేన్

మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ నటి సుస్మితా సేన్ లీడ్ రోల్ చేస్తున్న ‘తాలీ’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. తన ఇన్‌స్టాగ్రామ్ లో తాలీ కి సంబంధించిన పోస్టర్ ను  సుస్మితా సేన్  ఇవాళ విడుదల చేసింది. ఈ మూవీలో సుస్మితా సేన్ ట్రాన్స్ జెండర్ పాత్ర చేస్తోంది. ట్రాన్స్ జెండర్ యాక్టివిస్ట్,  సాయి సావ్లీ ఫౌండేషన్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీగౌరీ సావంత్‌ రియల్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ బయోపిక్ లో సుస్మితాసేన్  శ్రీగౌరి సావంత్‌ పాత్రను పోషిస్తోంది. ఆకుపచ్చ చీర ధరించి, నొదుట ఎర్రటి బొట్టుతో సుస్మితా సేన్ చప్పట్లు కొడుతున్న తాలీ పోస్టర్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. శ్రీగౌరి సావంత్‌ లాంటి గొప్ప వ్యక్తి పాత్రను పోషించడం చాలా ఆనందంగా ఉందని సుస్మితా సేన్ చెప్పింది.

అంత గొప్ప మనిషి జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని సుస్మిత చెప్పుకొచ్చింది. రవి జాదవ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను... కార్త్‌క్ డి నిషందర్, అర్జున్ సింగ్ బరన్, అఫీఫా నడియాద్‌వాలా సయ్యద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.