ఈవీఎంల రాండమైజేషన్ పూర్తి : వీ.పీ.గౌతమ్

ఈవీఎంల రాండమైజేషన్ పూర్తి : వీ.పీ.గౌతమ్

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : జిల్లాకు కేటాయించిన ఈవీఎంల మొదటి రాండమైజేషన్ ప్రక్రియను కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్​లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీ.పీ.గౌతమ్, రిటర్నింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శుక్రవారం చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు ఎన్నికల సంఘం నుంచి 3002 బ్యాలెట్, 2390 కంట్రోల్ యూనిట్లు, 2343 వీవీ ప్యాట్లు కేటాయించిదని, ఫస్ట్ లెవల్ లో 2899 బ్యాలెట్, 2289 కంట్రోల్ యూనిట్లు, 2242 వీవీప్యాట్ లు కండీషన్​లో ఉన్నాయన్నారు.  

వాటిని జడ్పీలోని గోడౌన్ లో భద్రపరచామని తెలిపారు. జిల్లాలో 1455 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు. మూడు సార్లు రాండమైజేషన్ ప్రక్రియ చేపట్టి రాజకీయ పార్టీల ప్రతినిధుల అంగీకారంతో కలెక్టర్ ఆమోదించారు. కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులకు ఈనెల 30 వరకు సమయం ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, మున్పిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డీవోలు జి. గణేశ్​, అశోక్ చక్రవర్తి పాల్గొన్నారు.

ఎన్నికల్లో ఖర్చు రూ.40లక్షల లోపే ఉండాలి

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఖర్చు రూ. 40లక్షల లోపే ఉండాలని కలెక్టర్​ డాక్టర్​ ప్రియాంక అల తెలిపారు. కలెక్టరేట్​లో శుక్రవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమైజేషన్ ​పద్ధతిలో ఈవీఎంలను నియోజకవర్గాలకు కేటాయించారు. నామినేషన్​ వేసిన నాటి నుంచి ఖర్చులు లెక్కలోకి వస్తాయని తెలిపారు. ఏ రోజు ఖర్చులు అదే రోజు రిజిష్టర్​లో నమోదు చేయాలన్నారు. వ్యయ పర్యవేక్షకులు తనిఖీ నిర్వహిస్తారని చెప్పారు. ఎన్నికల ఖర్చు కోసం బ్యాంకులో ఖాతాను ఓపెన్​ చేయాలన్నారు. ఆ ఖాతా నుంచే చెల్లింపులు ఉండాలని చెప్పారు. కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్​ వినీత్​, రిటర్నింగ్​ అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.