కులమతాలకు అతీతంగా చేపల వేట పండుగ

కులమతాలకు అతీతంగా చేపల వేట పండుగ

తమిళనాడులో చేపల వేట పండగ సందడిగా సాగుతోంది. పుదుక్కొట్టై జిల్లాలో ఏటా నిర్వహించే ఈ పండుగలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వలలు వేసి చేపలు పడుతూ కోలాహలంగా గడిపారు. పంట కోత పూర్తైన తర్వాత జరుపుకునే ఈ వేడుకలో కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా పాల్గొంటారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం ఈ సంబురాల్లో పాలు పంచుకుంటారు. 

వల వేసి చేపలను పట్టి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల వర్షాలు బాగా కురిసి, పంటలు బాగా పండుతాయన్నది స్థానికుల నమ్మకం. జనం తాము ఎన్ని చేపలు పట్టినా వాటిని ఎవరికీ విక్రయించరు. కరోనా కారణంగా రెండేళ్లుగా ఈ పండగ జరగలేదు. దీంతో ఈ ఏడాది జనం మరింత ఉత్సాహంగా ఈ పండగ జరుపుకుంటున్నారు.