పార్లమెంట్లో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్స్ సమావేశం

పార్లమెంట్లో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్స్ సమావేశం

కేంద్ర ప్రభుత్వం, దర్యాప్తు సంస్థల తీరును వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్స్ సమావేశయ్యారు. ఈ సమావేశానికి  కాంగ్రెస్,డీఎంకే, సీపీఎం,సీపీఐ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్సీపీ, శివసేన, ఆర్జేడీ పార్టీలు హాజరయ్యాయి.  ఈ మీటింగ్ కు తృణముల్, ఎస్పీ, ఆప్ పార్టీలు హాజరు కాలేదు. మరోవైపు గత కొన్ని రోజులుగా కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు చేస్తున్న టీఆర్ఎస్ కూడా విపక్షపార్టీల ఫ్లోర్ లీడర్స్ సమావేశంలో పాల్గొంది. పార్టీ తరపున కే.కేశవరావు మీటింగ్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థల అధికారాలను  దుర్వినియోగం చేస్తున్నదని విపక్షాలు మండిపడ్డాయి. మోడీ సర్కార్ తన రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై దర్యాప్తు  పేరుతో ప్రతీకారాన్ని తీర్చుకుంటోందని విమర్శించాయి.  అనేక రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేసి వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించాయి. బిజెపి ప్రభుత్వ తీరును విపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్స్ ఖండించారు. మోడీ సర్కార్ ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమిష్టి పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు.