TSPSC : రెండో రోజు నిందితులను విచారించనున్న సిట్ 

TSPSC : రెండో రోజు నిందితులను విచారించనున్న సిట్ 

TSPSC : టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులను  మార్చి 27న రెండో రోజు విచారించనున్నారు. రెండో రోజు విచారణలో కీలకమైన విషయాలను రాబట్టే అవకాశం ఉంది. నలుగురు నిందితులను సీసీఎస్ కార్యాలయం నుంచి సిట్ కార్యాలయానికి తరలించారు. ప్రవీణ్, రాజశేఖర్, డాక్య నాయక్, రాజేశ్వర్ ను మార్చి 26వ తేదీన సుదీర్ఘంగా విచారించారు సిట్ అధికారులు. 

డాక్య నాయక్, రాజేశ్వర్ స్టే చేసిన హోటల్ కు తీసుకువెళ్లి సిట్ అధికారులు వివరాలు సేకరించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 100 మార్కులకు పైగా సాధించిన 20 మంది అభ్యర్థుల నుంచి వివరాలను సైతం సేకరించారు. A10, A11, A12 నిందితుల కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో మార్చి 27న విచారణ జరగనుంది.

టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన డాక్య నాయక్ DRDAఉద్యోగి. ప్రస్తుతం కేసు కొనసాగుతుండడంతో  DRDA ఉన్నతాధికారులు ఆయన గురించి మరిన్ని వివరాలు ఆరా తీస్తున్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన నిరుద్యోగులకు ఎగ్జామ్స్ పేపర్స్ ను రేణుక అమ్మినట్లు గుర్తించారు. రేణుక భర్త డాక్య నాయక్ DRDA లో పరిచయం ఉన్న ఇతర ఉద్యోగులకు పేపర్లు అమ్మి.. సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపైనా ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు.. పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్ అయిన నిందితులు ప్రశాంత్ రెడ్డి, రాజేంద్రకుమార్, తిరుపతయ్య ఉపాధి హామీ పథకం ఉద్యోగులని గుర్తించారు.