పాపను చంపి క్షుద్ర పూజల కథలు అల్లారు.. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని.. అమ్మ, అమ్మమ్మ చేసిన నిర్వాకం

 పాపను చంపి క్షుద్ర పూజల కథలు అల్లారు.. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని.. అమ్మ, అమ్మమ్మ  చేసిన నిర్వాకం

చేసుకున్నదేమో ప్రేమ వివాహం.. కానీ ఆ ఆదర్శాన్ని నిజజీవితంలో కొనసాగించలేక పోయింది ఓ వివాహిత. కుల కట్టుబాట్లు దాటి ఎదిరించి నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు అతనితో జీవితం పంచుకుని  ఒక పాప పుట్టాక మనసు మార్చుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తినుంచి దూరమై మరో వ్యక్తిని చేసుకోవాలని నిర్ణయించుకుంది. కానీ రెండో పెళ్లికి పేగుతెంచుకు పుట్టిన 5 నెలల పాప అడ్డుగా ఉందని గొంతు నుమిలి చంపేసి తనలో అమ్మతనాన్ని కూడా చంపేసింది. ఈ ఘటన పిఠాపురంలో జరిగింది.

వివరాల్లోకి వెళ్లే.. పిఠాపురం మండలం నరసింగపురానికి చెందిన శైలజ రెండేళ్ల క్రితం సతీష్ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. కొద్ది కాలం క్రితం తిరిగి ఇంటికొచ్చిన శైలజ, 5 నెలల క్రితం యశ్విత అనే పసిబిడ్డకు జన్మనిచ్చింది. 

అయితే శైలజ మనసు మార్చి, తమ కులానికి చెందిన వ్యక్తితో రెండో వివాహం జరిపించాలని శైలజ అమ్మ అన్నవరం నిర్ణయించింది. దీనికి పాప యశ్విత అడ్డు తొలగించాలని, 5 నెలల పసికందును ఈ నెల (మే) 6న గొంతు నులిమి చంపేసి.. ఇంటి పక్కనే ఉన్న బావిలో పడేశారు. 

ఎవరికీ అనుమానం రావద్దని క్షుద్రపూజల కథలు అల్లారు. ఎవరో తమ ఇంటికి క్షుద్ర పూజలు చేసి చిన్నారిని చంపేశారని ఇంటి ముందు ముగ్గు వేసి, నిమ్మకాయలు పెట్టి నమ్మించారు. చివరకు పోలీసులు తమ రీతిలో విచారణ జరపగా చిన్నారిని తామే చంపినట్టు శైలజ, ఆమె తల్లి అన్నవరం ఒప్పుకున్నారు.